మోడీ... ఇగో వద్దు, ఇవిగో ఐడియాలు - మన్మోహన్

May 30, 2020

నానాటికీ మందగమనం వైపు నడుస్తున్న భారతాన్ని ముందుకు నడిపించడానికి కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని నరేంద్రమోడీకి మాజీ ప్రధాని ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ సూచించారు. పరిస్థితి చేజారిపోయిందని, ఇప్పటికపుడు చర్యలు తీసుకున్నా... కోలుకోవడానికి మూడు నాలుగేళ్లు పడుతుందని... వీలైనంత త్వరగా సరైన నిర్ణయాలు తీసుకోమని మన్మోహన్ సింగ్ సూచించారు. అంతేకాకుండా ఏం చేయాలో కూడా ఆయన వివరించారు. 
నిరుద్యోగిత గత 40 ఏళ్లలో అత్యధికం. ఆర్థిక మందగమనంలో కాపాడే రంగాలే పతనం వైపు నడుస్తున్నాయి. 3.5 లక్ష ఉద్యోగాలు పోయాయి. పన్నులతో వ్యాపారులు చితికిపోతున్నారు. నిర్లక్ష్యం చేయకుండా ఈ కింది చర్యలు వెంటనే చేపట్టాలని మన్మోహన్ వ్యాఖ్యానించారు.

1. జీఎస్‌టీ పన్ను రేట్లను సరళీకరించాలి.

2. వ్యవసాయ రంగ పునరుద్ధరణకు తోడ్పడేలా సేద్యానికి పరపతి సాయం పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెంచాలని సూచించారు. వ్యవసాయ ఆధారిత మార్కెట్లకు ఉన్న అన్ని సంకెళ్లను తీసేయాలి. నేరుగా ప్రజల చేతికి డబ్బులు అందాలి.

3. ఉపాధి కల్పించే రంగాలైన ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమలో సమస్యలను తక్షణం పరిష్కరించాలి.

4. నగదు కొరతను వెంటనే అధిగమించాలి. 

5. అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌ నేపథ్యంలో ఎగుమతులకు అవకాశాలున్నాయి. వాటిని కనిపెట్టి సద్వినియోగం చేసుకుంటే ఎంతో భవిష్యత్తు ఉంటుంది. ప్రైవేట్‌ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు అవకాశాలను అన్వేషించాలని కోరారు.

Read Also

దేవులపల్లి అమర్ ఫెయిల్యూర్ స్టోరీ..! నేషనల్ మీడియాలో అంతా నెగెటివ్ ప్రచారమే..!
మోదీ లెటర్.. జగన్ నుంచి నో రిప్లయ్.. ఎందుకు?
ఇక నుంచి మంచోళ్లకి కార్ ఇన్సూరెన్స్ తక్కువ రేటట!