మన్మోహన్ సింగ్ కి ఏమైంది?

August 12, 2020

Manmoham Singh: మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థిక నిపుడు మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటనేది ఇంకా డాక్టర్లు వెల్లడించలేదు. కార్డియాలజీ విభాగంలో ఆయనను ఉంచి చికిత్స అందిస్తున్నారు. దేశాన్ని సంస్కరణల బాట పట్టించిన మన్మోహన్ సింగ్ ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి దేశానికి కొత్త బాటలు పరిచారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన అనారోగ్యానికి గురికావడం కాంగ్రెస్ నే కాదు, దేశం మొత్తాన్ని కలవరపరుస్తోంది. సోనియాగాంధీ, ప్రధాని నరేంద్రమోడీ ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. 

కొద్ది నిమిషాల క్రితమే ఆయన మోడీ ని ఉద్దేశించి ఓ వ్యాఖ్య కూడా చేశారు. ’’నన్ను సైలెంట్ పీఎం అన్నారు. కానీ మోడీలాగా మీడియాతో మాట్లడటానికి ఏనాడు భయపడలేదు‘‘ అంటూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్య వైరల్ అవుతోంది.