బాబూ లిబరల్స్.. ఎక్కడున్నారమ్మా

August 10, 2020

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలనుకున్న సీఏఏ, ఎన్నార్సీ చట్టాల పౌరసత్వ సవరణ చట్టం గురించి మన స్వేచ్ఛావాదులు ఎంతగా రెచ్చిపోయారో.. ఎన్ని రకాల ఆందోళనలు చేశారో.. ఎంత హింసాత్మకంగా ప్రవర్తించారో చూశాం. భారతీయ ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని.. అక్రమంగా దేశంలోకి చొరబడ్డ వారికే సమస్య అని.. విదేశాల్లో మైనారిటీలుగా అష్టకష్టాలు పడుతున్న హిందువులకు ఈ చట్టం తోడ్పాటు అందిస్తుందని.. నిపుణులు ఎంతగా మొత్తుకున్నా వినలేదు లిబరల్స్. హింసాత్మక ఆందోళనలతో పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా నెలకొన్న పరిస్థితులపై మాత్రం ఈ పేరు గొప్ప లిబరల్స్ ఎవ్వరూ నోరు విప్పట్లేదు.

పాకిస్థాన్లో ముస్లిమేతరుల్ని ఎంత హీనంగా చూస్తారో.. వాళ్లు అక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నారో దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కరోనా కష్ట కాలంలో వారిపై వివక్ష దారుణంగా ఉంటోంది. కేవలం ముస్లింలకు మాత్రమే అన్న పానీయాలు అందిస్తూ హిందువులు, క్రిస్టియన్లను పక్కన పెట్టేస్తుండటం గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇటు ఇండియాలో చూస్తే మాస్ గ్యాథరింగ్స్ వద్దని ఎంత మొత్తుకుంటున్నా వినకుండా కరోనా ప్రభావం పెరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో రెండు రోజుల పాటు ముస్లిం మత పెద్దలు భారీ సభ నిర్వహించారు. అక్కడి నుంచి వచ్చిన వందల మందికి కరోనా వ్యాప్తి చెందిందని.. వారు మరింతో మందికి వైరస్ అంటించారని వార్తలొస్తున్నాయి. ఇందులో బాధ్యతా రాహిత్యం స్పష్టం. అటు పాకిస్థాన్లో పరిస్థితులపై, ఇటు ఇండియాలో విపరీత ప్రవర్తనపై ఏ లిబరల్ కూడా నోరు విప్పట్లేదు. సీఏఏ, ఎన్నార్సీ మీద విరుచుకుపడ్డ వాళ్లు ఇప్పుడు ఏమయ్యారన్నదే అర్థం కావడం లేదు.