అనంతపురంలో ఆస్పత్రులన్నీ మూసేయండి

August 03, 2020

అనంతపురం జిల్లా వైద్య ఉద్యోగులు మెరుపు ధర్నా చేశారు. వర్షం పడుతున్నా కూడా భారీ సంఖ్యలో వారు ధర్నా కు దిగడం గమనార్హం. ఇంతకీ వాళ్లు ధర్నాకు దిగింది ఎందుకో తెలిస్తే విస్మయం వ్యక్తంచేయాల్సిందే.

జాయింట్ కలెక్టర్ సిరి, ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ చంద్ తనిఖీల్లో భాగంగా ఔషధ గోదాములను పరిశీలించారు. అనంతరం డీహెచ్ఎంవో గదికి వెళ్లి సమీక్షలు మొదలుపెట్టారు. నివేదికలు తీసుకురండి పరిశీలించాలి అని చెప్పినందుకు ఆయన హర్టయ్యారట. తప్పులు చేయని వారు నివేదికలు తేవాలి గాని హర్ట్ కావడం ఏంటి? విచిత్రం కాకపోతే ! వారు ప్రశ్నిస్తుండగానే ఆయన అలిగి ఇంటికెల్లారు. అవమానించారట ఆయన్ను. 

జేసీ డ్యూటీ చేస్తే అవమానం ఫీలవడం ఏంటో. ఇక డీహెచ్ఎంవో కు మద్దతు జిల్లాలోని అన్ని రకాల వైద్య ఆరోగ్య సిబ్బంది ధర్నాకు దిగారు. రెవెన్యూ జోక్యం తమ డిపార్టుమెంటులో పెరిగిందన్నది వారి ఆరోపణ. అందుకే ఆస్పత్రులను మూసేయాలట. ఇది ఎంత బరితెగింపు అంటే క్షమించరానిది.

తప్పులు చేయనపుడు తనిఖీ చేస్తే భయపడాల్సిన, అవమానపడాల్సిన అవసరం ఏముంది? ఇది పక్కన పెడితే... గతంలో ఒక డాక్టరును రోడ్డు మీద చితకబాదితే ఇలాంటి ధర్నా జరగలేదు. కానీ ఇపుడు తనిఖీలు చేసినందుకు వానలో ధర్నా చేశారు. తేడా ఏంటో తెలుసా... అపుడు ముఖ్యమంత్రికి - డాక్టరుకు పోరాటం. సీఎంతో పెట్టుకోవడానికి భయపడ్డారు. ఇది అధికారులు-అధికారులు మధ్య కాబట్టి పౌరుషం పొడుచుకొచ్చింది సిబ్బందికి. ఇదే ధైర్యం రాజకీయ నాయకులపై తిరగబడటానికి కూడా ఉండాలి కదా.