చిరంజీవేంటి... ఇలా మాట్లాడేశాడు...

May 27, 2020

చిరంజీవి. తెలుగు వెండితెర మెగాస్టార్. అతని గురించి మిగతా విషయాల సంగతి పక్కన పెడితే ఎవరిని అయినా తన మాటల ద్వారా, సమయం ఇవ్వడం ద్వారా ప్రోత్సహించడంలో ముందుంటారు. హీరో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం ప్రి రిలీజ్ ఫంక్షనుకు హాజరైన చిరంజీవి అనేక విషయాలపై ఆసక్తికరంగా మాట్లాడారు. ఆ సినిమా దర్శకుడి గురించి... తన సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న ఠాగూర్ మధు గురించి, అందాల భరిణి అయిన లావణ్య బుగ్గల గురించి చిరంజీవి చమత్కారాలు వేశారు. ఫంక్షనుకు ఠాగూర్ మధు వల్ల హాజరయినా... అందరినీ గుండెకు హత్తుకుని మాట్లాడారు. సెటైర్లు కూడా వేశారు. ఆయన మాటల్లో ఆ చమత్కారాలేంటో చూద్దాం.