చిరంజీవి పాత అల్లుడి కొత్త భార్యను చూశారా?

June 04, 2020

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి పెళ్లి ఎంత వివాదాస్పదమైందీ అందరికీ తెలిసిందే. తెలిసీ తెలియని వయసులో శ్రీజ ప్రేమలో పడి తండ్రిని, కుటుంబాన్ని మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టింది. అయితే, అనతి కాలంలోనే ఆమె మనసు మార్చుకుని తాను చేసింది తప్పని, తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని నిర్ణయించుకుని వెళ్లిపోయింది. తనతో పాటు కూతురుని కూడా తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెకు మళ్లీ పెళ్లి చేశారు చిరంజీవి. 

ఇదిలా ఉండగా... 2014లో విడిపోయాక శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ బాగా ఇబ్బందుల్లో పడిపోయారు. జీవనానికి కూడా ఇబ్బంది అన్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే తాను బాగున్నానని శిరీష్ అప్పట్లో ఖండన ఇచ్చారు. తర్వాత ఎవరి జీవితం వాళ్లు గడుపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విహనతో భరద్వాజ్ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వివాహం మూడు నెలల కిందట జరిగిందని, ఫొటోలు బయటకు రావడం మాత్రం ఇపుడే అంటున్నారు. వాస్తవానికి అతను ప్రేమలో ఉన్నట్టు కొన్ని నెలల కిందటే వార్తలు వచ్చాయి. అదిపుడు నిజమని తేలింది. శిరీష్ రెండో భార్య చక్కగా ఉంది. ఫొటోలో ఇద్దరు సంతోషంగా ఉన్నారు.