పీవీపీ కొంపలో చిరంజీవి కుంపటి

August 07, 2020

హెడ్డింగ్ కాస్త హార్ష్ గా ఉన్నా భావం మాత్రం సున్నితమే లేండి. స్వయంగా ఆ పీవీపీయే మ ా కాపురంలో నిప్పులు పోయకు సామీ అంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ విషయమేంటా అని చూస్తున్నారా... #BeTheRealmen ఛాలెంజ్ ఒకటి నడుస్తోందిగా టాలీవుడ్లో. అందులో చిరంజీవినీ ఇరికించారు. ఇంకేముందు చిరంజీవి ఇల్లు శుభ్రం చేయడమో, టేబుల్ తుడవడమో, మొక్కలకు నీళ్లు పోయడమో చేసి ఉంటే సరిపోయేది. ఏకంగా వంటలు చేసి పెట్టారు. దీంతో అందరూ వామ్మో వాయ్యో అంటున్నారు. చిరంజీవే వంట చేయగా లేనిది నీకేమయింది పెళ్లాలు పోరు పెడుతున్నారట. 

పాపం ఈ కష్టం ఎవరికి వచ్చిందో తెలుసా? ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పీవీపీకి. చిరంజీవి వంటలు చేయడం మాకు తలనొప్పిని తెచ్చిపెట్టిందంటూ ఆయన చతమత్కారపూరితంగా ఒక ట్వీటు వేశారు. చిరంజీవి గారు,ఏదో ఇంట్లో అంట్లు తోమగలము,గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు..మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్ గారు. Jokes apart, your continued inspiration is admirable Sir

ఇదిపుడు వైరల్ అవుతోంది. నిజమే చిరంజీవి దోసె అని అదేదో రెస్టారెంట్లో వినడమే గాని... చిరంజీవే దోశెలు పోస్తారనుకోలేదు అంటూ ఆయన అభిమానులే కాదు, ఇతరులు కూడా అంటున్నారు. చెప్పలేకపోతున్నారు గాని పాపం చిరంజీవి అభిమానులు కూడా చిరంజీవి మీద ఆగ్రహంగా ఉన్నారట. బాసూ... మా ఇంట్లో అంతా నాతోనే వంట చేయిస్తున్నారు. మీ హీరోయే చేస్తుంటే నీకేంటని దొబ్బుతున్నారు. మిమ్మల్ని ప్రాణంగా అభిమానిస్తే మాకింత కష్టం తెచ్చిపెడతావా అంటూ అభిమానులు ఆనందభాష్పాల్లాంటి కన్నీళ్లు కారుస్తున్నారు. అరెరెరె ఎంత దారుణంగా బుక్ చేశావయ్యా చిరంజీవా వీళ్లందరినీ. నీ మానా నువ్వు మాడిపోయిన మసాలా దోశె వేసుకుని తినకుండా ఇంత మందికి  కష్టం తెచ్చిపెట్టావా? కానీ క్వారంటైన్ ని కాస్తా జైలు శిక్ష చేసేసేశావు కదా మెగాస్టారూ !