లేడీ ట్రంప్ .. గురించి కొన్ని సీక్రెట్స్

August 07, 2020

ఇంతవరకు పలువురు అమెరికా అధ్యక్షులు ఇండియాకు వచ్చారు. కానీ ఎపుడూ ట్రంప్ కి వచ్చినంత బజ్ రాలేదు. ఇప్పట్లో సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండటం, మీడియా విస్తృతి ఒక కారణం కావచ్చేమో గాని... అసలు కారణం మాత్రం  డొనాల్డ్ ట్రంపే. అమెరికా చరిత్రలోనే భిన్నమైన అధ్యక్షుడు ట్రంప్. అతను రాజకీయ నాయకుడే కాదు గొప్ప వ్యాపారి కూడా. ఇప్పటికే ట్రంప్ గురించి మనం చాలా తెలుసుకున్నాం. కానీ అతని భార్య మెలానియా ట్రంప్ విశేషాలు ఈరోజు ఆమె కూడా ఇండియా వస్తున్న సందర్భంగా తెలుసుకుందాం.

* మెలానియా ట్రంప్‌.. సాధారణ మహిళ నుంచి అమెరికా మొదటి మహిళ స్థాయికి చేరుకుంది. ఇది ఆమె శ్రమ, అదృష్టం. స్లోవేనియాలో 1970లో పుట్టారు. 

* 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు. అపురూపమైన తేజస్సు. ఒకప్పుడు ఫ్యాషన్‌ డిజైనర్. ఆ తర్వాత సూపర్‌ మోడల్‌. 

* 6 భాషల్లో ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. స్లొవేనియన్, ఫ్రెంచ్, సెర్బియన్, జర్మన్, ఇటాలియన్, ఇంగ్లిష్‌ భాషాల్లో ప్రావీణ్యం సంపాదించింది. (ఇలా ఎక్కువ భాషలు మాట్లాడేవారిని పాలీగ్లాట్ అంటారు.)

* ఆమె మితభాషి. తన కొడుకు బారన్‌ లే అంటే ఆమెకు ప్రాణం.

* తల్లి అమలిజా పిల్లల బట్టల డిజైనర్. అందువల్లే ఆమెకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై ఇష్టం కలిగింది. పదహారో ఏట నుంచి మోడలింగ్ చేస్తున్నారు.  మోడల్ గా తాను వేసుకొనే డ్రెస్‌లను తానే డిజైన్‌ చేసుకునేవారు. 

* 2000 ఏడాదిలో బ్రిటన్‌కు చెందిన ‘జీక్యూ’ మ్యాగజీన్‌ ఫొటోలకు ఆమె నగ్నంగా పోజులిచ్చారు. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక అవి మరోసారి తెరపైకి రావడంతో సంచలనం అయ్యింది.

* 1998లో అమెరికాకు వచ్చిన మెలానియాకు ట్రంప్‌తో ఓ పార్టీలో పరిచయమైంది. ఆమె ట్రంప్ కు మూడో భార్య. 

* ట్రంప్‌ తో పాటు ఆమె అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి ఆమె మకాం మార్చలేదు. తొలుత ట్రంప్ బ్యాచిలర్. ఆలస్యం. 2017లో కొడుకుతో కలసి వైట్‌హౌస్‌కు మారారు. 

* వైట్‌హౌస్‌లో ట్రంప్ , మెలానియా కలిసి పడుకోరని... ఎడమొహం, పెడమొహంగా ఉంటారని బెన్నెట్‌ రాసిన ఫ్రీ మెలానియా పుస్తకంలో బయటకొచ్చి సంచలనమయ్యాయి.