ఎన్టీఆర్ బాడీ గురించి రానా ప్రేయసి మిహిక కామెంట్స్ విన్నారా

August 03, 2020

నిన్న మొన్నటి వరకు మిహిక ఎవరో ఎవరికీ తెలియదు. రానా ‘‘ఆమె నాకు ఎస్ చెప్పింది’’ అంటూ మిహిక ఫొటో షేర్ చేశాక ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ ప్రముఖులకు దగ్గర బంధువు అయిన మిహక జస్ట్ కొద్ది రోజుల క్రితమే తెలుగు జనాలకు పరిచయం అయింది. ఇపుడు చర్చంతా ఆమె గురించే. ఈరోజు ఇరు కుటుంబాలు నిశ్చితార్థం, పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవడానికి కలుస్తున్నాయి. 

ఇదిలా ఉండగా... గత ఏప్రిల్ 20న ట్విట్టరులో కొత్తగా జాయిన్ అయిన మిహిక... టాలీవుడ్లో చాలా ఫాస్ట్ గా ట్వీట్లు చేస్తోంది. సందడి సందడిగా ఉంటోందీ అమ్మాయి. అచ్చం తెలుగు పిల్లలా సరదాగా ఉంటోంది.

ఇక నిన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ కు 2 కోట్ల మందికి పైగా ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఎవరెవరు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారా అని అందరూ చర్చించుకున్నారు. ప్రముఖులంతా చెప్పారు. అందులో మిహిక కూడా ఉన్నారు. అయితే... ఎన్టీఆర్ మిహికకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు ఉన్నాయి ఆమెట్వీట్లు.

ఇప్పటివరకు ఆమె 7 ట్వీట్లు వేస్తే మూడు ఎన్టీఆర్ గురించే ఉన్నాయి. 19వ తేదీన ఎన్టీఆర్ లుక్ వైరల్ అయిన విషయం తెలిసిందే. సిక్స్ ప్యాక్స్ యాబ్స్ తో ఎన్టీఆర్ సూపర్ ఫిట్ గా కనిపించిన ఫొటోను షేర్ చేసిన మిహిక ’అమేజింగ్ ట్రాన్సఫర్మేషన్ ‘ అంటూ ట్వీట్ చేసింది. 

ఆ తర్వాత మరుసటి రోజు నా ఫేవరెట్ నటుడు తారక్ సర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ జై లవకుశ పోస్టరులో జై ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పింది మిహిక. అంటే ఆమె ఎన్టీఆర్ సినిమాలు బానే చూస్తోందని అర్థమవుతోంది. 

మళ్లీ ఎన్టీఆర్ కి, మనోజ్ కి రానా విషెస్ చెప్పిన ట్వీటును రీట్వీట్ చేస్తూ ఇంకో సారి తారక్ కి ఆమె శుభాకాంక్షలు చెప్పారు. మొత్తానికి రానా ను పెళ్లి చేసుకుంటూ ఫేవరెట్ యాక్టర్ రానా కాదు ఎన్టీఆర్ అని మిహిక చెప్పడం... ఆమె ఫెయిర్ నెస్ కి, డేర్ కి నిదర్శనం.