అసదుద్దీన్ ఒవైసీ అరాచకం... పార్లమెంటుకు షాక్

June 01, 2020

ఈ రోజు కీలకమైన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు లోక్ సభకు వచ్చింది. ఈ బిల్లు సుదీర్ఘ చర్చ అనంతరం సోమవారం రాత్రి లోక్ సభలో పాసయ్యింది. అయితే... ముస్లింల పరిరక్షణ పేరిట పుట్టిన పార్టీగా చెప్పుకునే ఒవైసీీ బిల్లు ప్రతులు చించేసి పార్లమెంటుకు షాక్ ఇచ్చారు. బిల్లు అసలు ఉద్దేశాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాదు, అమిత్ షాపై తీవ్రమైన కామెంట్లు చేశారు ఒవైసీ. అతన్ని హిట్లర్ తో పోల్చారు. మన సరిహద్దుల్లోని విదేశాల నుంచి వచ్చే అన్ని మతాల వారికి అవకాశం ఇచ్చి కేవలం ముస్లింల పట్ల మాత్రమే ఈ బిల్లు వివక్ష చూపిస్తోందని.. ఒవైసీీ ఆరోపించారు. 

అమిత్ షా ఏమన్నాడు?

1947 నుంచి శరణార్థులను అంగీకరిస్తున్నాంజ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌ కే అద్వానీ సైతం శరణార్థలు. బిల్లుకు 130 కోట్ల ప్రజల మద్దతు అవసరం. సరిహద్దులను కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. పౌరసత్వ బిల్లుతో ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగదు. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ర్టాల ప్రజలు ఆందోళన చెందొద్దు. పౌరసత్వ సవరణ బిల్లుకు మేము కట్టుబడి ఉన్నాం. ఈ బిల్లు ద్వారా ఎవరి హక్కులు హరించడం లేదు. మైనార్టీలు మరిన్ని హక్కులు పొందుతారు. బిల్లులో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదు. మార్పులను ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే దేశ ఐక్యతను విశ్వసిస్తున్నాం. 

అసుదుద్దీన్ ఒవైసీ ఏమన్నాడు

ఈ బిల్లు చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షాపై ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. హిట్ల‌ర్ త‌ర‌హాలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని ఓవైసీ కామెంట్ చేశారు.  పౌర‌స‌త్వ బిల్లుకు ఎంఐఎం వ్య‌తిరేకం అన్నారు.  పౌర‌స‌త్వ బిల్లు ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ఉల్లంఘిస్తోందని షా హిట్ల‌ర్‌గా మారార‌ని ఓవైసీ ఆరోపించారు.