ఈ లోక్ సభ అభ్యర్థి... ఎంత అందగత్తె అంటే...

July 11, 2020

ఈసారి ఎన్నికల్లో స్టార్ల హడావుడి పెరిగింది. మన హీరోయిన్లు కూడా మన వద్ద పోటీ చేయడం లేదు. కానీ మన వెటరన్ హీరోయిన్లు వేరే చోట్ల రాణించారు. సుమలత, జయప్రద వంటివారు ఉదాహరణ. అయితే, ఈసారి కాంటెంపరరీ హీరోయిన్లు కూడా ఎన్నికల బరిలో దిగారు. వారిలో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మిమి చక్రబర్తి. ఈ బెంగాళ్ హాట్ గాల్ ఇంతకాలం తన అందాలతో అందరినీ ఆకట్టుకుని ఇపుడు తన ప్రచారంతో ఆకట్టుకుంటోంది. బెంగాలీ సినీ ప్రపంచంలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈమె వల్ల తృణమూల్ పార్టీకి మంచి క్రేజే వచ్చింది. ఇలాంటి అందమైన మోము, లేత వన్నె అమ్మాయి ఎన్నికల బరిలో ఉందని మీకు తెలుసా. ఈమె బెంగాల్ లోని జాదవ్ పూర్ నుంచి పోటీలో ఉన్నారు. ఈమెకు ప్రత్యర్థులు వికాస్ రంజన్ భట్టాచార్య (సీపీఎం-కాంగ్రెస్), అనుపమ్ హజ్రా (బీజేపీ).
జాదవ్ పూర్ కోల్ కతా దక్షిణప్రాంతం. 1996 నుంచి ఇక్కడ టీఎంసీ బలంగా ఉంది. గతంలో ఈ సీటునుంచే మమత బెనర్జీ గెలిచింది. అయితే ఆమె కాంగ్రెస్ లో ఉన్నపుడు ఈ సీటు గెల్చింది. ముందు సీరియల్ నటిగా పేరుపొంది పాపులర్ అయిన మిమి చక్రవర్తి, 2012లో సినిమాల్లో ప్రవేశించింది. ఆమె రాజకీయ అనుభవం గురించి పలువురు వేసిన ప్రశ్నకు ఆమె ఒక స్ట్రాంగ్ సమాధానమే ఇచ్చింది. ప్రజలకు సేవ చేయడానికి ఉండాల్సింది కోెరిక, అనుభవం కాదు. నాకే కాదు, ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి ఎవ్వరికీ రాజకీయ అనుభవం అవసరం లేదని గడుసు రిప్లయి ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నేను తక్కువ మాట్లాడతాను. ఎక్కువ పనిచేస్తాను అని పేర్కొంటూ అందరికీ చేరిందావిడ. రాజకీయాలు పక్కన పెడితే... ఈమె సభలకు మాత్రం జనం తెగ వస్తున్నారట.
మరీ ఇంత అందంగా ఉంటే రారా?