బాబు గారు ఇంకా తేరుకోలేదు...కానీ రికార్డే

August 02, 2020

13 గంటలు

33 లక్షలు 

(ఇది రాసే సమయానికి)

అవును పండుగాడు మైండ్ బ్లాక్ చేశాడు. అందరూ చూసిన పాటను చూపించి కేవలం 13 గంటల్లో 33 లక్షల మంది చేత విజిలేయించాడు. ఈ సంక్రాంతి రేసులో దూకిన మహేష్ బాబు సంక్రాంతి విన్నర్ కాకపోయినా విజేతే. సినిమా డబ్బులు తెచ్చింది. తనకంటూ ఓ ప్లేస్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా మొత్తానికి లాండ్ మార్క్ గా చెప్పుకోవాల్సిన విషయాలు రెండు. ఒకటి ’నెవ్వర్ బిఫోర్ , ఎవ్వర్ ఆఫ్టర్‘ డైలాగ్ పిచ్చపిచ్చగా జనానికి ఎక్కేసింది. రెండోది మహేష్ మాస్ లుక్. ఇందులో మైండ్ బ్లాక్ అంటూ మహేష్ - రష్మిక క్రియేట్ చేసిన సంచలనం 50 రోజులు అయినా వేడి తగ్గలేదు.

మాస్ మసాలా సాంగ్ లకే బాప్ గా నిలిచిన ఈ సాంగ్ అభిమానులకే కాదు, సినీ ప్రియులకు కూడా పిచ్చెక్కించింది. మహేష్ లుక్, డ్యాన్స్... మ్యూజిక్..అబ్బో ఒకటేమిటి ఈ పాట పాట ఒక మాస్ మాస్టర్ పీస్. తాజాగా సినిమా 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆ పాట ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. జనం పిచ్చిక్కి చూశారు. 

ఇకపోతే... పాడిందే పాడరా అన్నట్టు... దీనిని ట్వీట్  చేస్తూ మహేష్ మరోసారి తన సినిమా ’బ్లాక్ బస్టర్‘ అన్నాడు.