మహేష్ బాబుకు షాకిచ్చిన మంత్రి

August 07, 2020

ఏపీ విభజన అనంతరం సినిమా వాళ్ల పరిస్థితి డైలమాలో పడింది. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్టు... ఏపీని సమర్థించలేరు, తెలంగాణని వ్యతిరేకించలేరు. వైస్ వర్సా కూడా సాధ్యం కాదు. అందుకే అంతర్జాతీయ విషయాలపై స్పందించే ఈ తెలుగు తారలు తెలుగు రాష్ట్రాల విషయంలో మూసుకుని కూర్చుంటారు.

తాజాగా మహేష్ బాబు సంక్రాంతి సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా విజయోత్సవ సభను వెరైటీగా వరంగల్ లో పెట్టారు. దీనికి ముఖ్యఅతిథిగా ఎర్రబెల్లిని ఆహ్వానించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఫంక్షనుకు హాజరయ్యి పలు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. స్టేజి మీదే ఇదిగో మీరు హైదరాబాదు తర్వాత ఇంకో చోట సినిమా ను డెవలప్ చేద్దాం అనుకుంటే వరంగల్లోనే చేయండి. వైజాగ్, విజయవాడకు పోవద్దు అని స్పస్టంగా చెప్పేశారు మంత్రి ఎర్రబెల్లి. కాళేశ్వరం వచ్చాక పరిస్థితి మారిపోయింది. వరంగల్ కోనసీమ అయ్యింది. మరీ ఆంధ్రాకు పోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి.

అంతేకాదు... ఇదిగో అనిల్ రావిపూడికి ఆ వైజాగంటే ఇష్టం. నువ్వటు తీస్కపోవద్దు. ఒకవేళ అటు తీసుకెళ్తే మా దిల్ రాజు, వంశీ ఇటు గుంజుకొస్తరు అంటూ నవ్వుతూనే తూటాల్లాంటి మాటలు వదిలారు ఎర్రబెల్లి. దీనికి ఎలా స్పందించాలో కూడా తెలియక మహేష్ బాబు నవ్వుకుని అవాయిడ్ చేశారు. మొత్తానికి మహేష్ బాబుని తెలంగాణ మంత్రి గొప్ప ఇరకాటంలోకి నెట్టేశారు. అవుననలేడు. కాదనలేడు.