పోలీసులకు పిచ్చెక్కించిన దొంగతనం

July 12, 2020

ఈ వార్త విన్నాక హైదరాబాద్‌ ప్రజలు చాలా అలర్టయిపోయారు.
అసలు ఆ వార్త ఏంటి? ఎందుకు అలర్ట్ అయ్యారు? అంటారా... నిజంగా షాకింగే ఇది.
అనుక్షణం మనుషులు తిరిగే అఫ్జల్ ఘంజ్ బస్టాండ్లో ఒక ఆర్టీసీ బస్సు మాయమైంది. అదేంటి ఆర్టీసీ బస్సు మాయం కావడం ఏంటి అనుకోకండి. రాత్రి పార్క్ చేసిన బస్సు పొద్దున కనిపించలేదు. దీన్ని మొదట ఆర్టీసీ నమ్మలేదు. తర్వాత బస్సు ఎత్తుకెళ్లారని అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాళ్లు దాని ఆచూకీ కనుక్కోవడానికి నానా తిప్పలు పడ్డారు. అఫ్జల్‌గంజ్ బస్టాండ్‌లో బస్సును దుండగులు దొంగతనం చేశారట. దానిని తూప్రాన్ మీదుగా నాందేడ్ కు తీసుకెళ్లారు. ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లేకుండా ఇంతదూరం ప్రయాణిస్తే ఎవరూ అనుమానించకపోవడం ఒక విచిత్రమైతే.... ఆ బస్సు ఏమైందో కనుక్కోవడానికి పోలీసులు పడిన అవస్థ మామూలుది కాదు. విచిత్రమేంటంటే... అంతదూరం బస్సును ఎత్తుకెళ్లిన దండుగులు ఏం చేశారో తెలుసా.... అచ్చం ఖలేజా సినిమాలో లాగా... మొత్తం బస్సును ఊడబీకేశారు. ఏ పార్టుకు ఆ పార్టు వేరు చేశారు.
మహారాష్ట్రలోని నాందెడ్‌ ప్రాంతంలోని కంకిడి అనే ఊరి సమీపంలోని ఓషెడ్డులో బస్సును ముక్కలు చేస్తుండగా పోలీసులు గుర్తించారు. బస్సును నలుగురు దొంగలించినట్లు అర్థమైంది. వారిలో ఒకరు దొరికారు. మిగతా వాళ్లు పారిపోయారు. దొంగల్నయితే పట్టుకున్నారు గాని అప్పటికే ఆ పార్టులు, బస్సు మాయం. కేవలం బేస్ స్కెలిటన్ మాత్రమే మిగిలి ఉంది. సీట్లను కూడా తొలగించి చాలా వరకు తరలించేశారు. 

అంత మంది తిరిగే చోట బస్సును ఇల ా ఎత్తుకెళ్లారంటే... బయట వాహనాలు పెట్టాలంటే భయపడి చస్తున్నారు హైదరాబాదు వాసులు. ఏంటి ఇంత సులువుగా ఎలా ఎత్తుకెళ్తారబ్బా అని షాక్ అవుతున్నారు జనం.