​కరోనా తప్పుడు లెక్కలు ఎందుకు జగన్  ?

June 05, 2020

అందరూ కరోనా ఎందుకు ఏపీలో ప్రబలడం లేదని ఆశ్చర్యపోతున్నారు. కానీ అక్కడేదో మతలబు ఉందని ఇంకొందరు అంటున్నారు. అక్కడ కొన్ని జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. నిజంగా నమోదు కాకపోతే సంతోషమే కాకపోతే తాజాగా ఈరోజు ఏపీ గవర్నమెంటు అధికారిక పత్రాల్లో తప్పుడు లెక్కలు చూస్తుంటే... లెక్కలు ఏమైనా దాస్తున్నారా అనే అనుమానం కలగకమానదు. 

ఆదివారం ఉదయం పది గంటలకు విడుదల చేసిన​ మీడియా బులిటెన్లో (82) ఇప్పటివరకు 433 మందికి టెస్టులు చేస్తే 19 మందికి పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఈరోజు 16 శాంపిల్స్ టెస్ట్ ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు. 

మళ్లీ సాయంత్రం 8 గంటలకు విడుదల చేసిన మీడియా బులిటెన్లో (83) ఇప్పటివరకు 412 మందికే టెస్టులు చేసినట్లు పేర్కొన్నారు. అంటే పొద్దున చెప్పింది అబద్ధమా? రాత్రి చెప్పింది అబద్దమా? లేదా వాస్తవాలు దాచి ఏదో నోటికొచ్చింది రాసి పంపిస్తున్నారా? ఈ లేటెస్ట్ బులిటెన్లో 82 మందికి టెస్టులు చేస్తే 2 ఇద్దరికి వ్యాధి నిర్దారణ అయినట్టు పేర్కొన్నారు.

మరి ఎందుకు ఈ క్లారిటీ మిస్సవుతున్నారు. అధికారులు ప్రకటన విడుదల చేసేటపుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదా? అసలు ఏం జరుగుతోంది ఏపీలో. అత్యధిక ఎన్నారైలు ఉన్న ఏపీ గురించి చాలామంది భయపడుతున్నారు. పరీక్షలు అనుమానితులు అందరికీ త్వరగా చేయడం వల్ల ఏపీ కరోనా బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.