టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంత పని చేశాడంటే...

August 09, 2020

ఎంత చెప్పిన ప్రజలు జాగ్రత్తగా ఉండటం లేదని ప్రభుత్వాలు నటిస్తున్నాయని చెప్పడానికి తాజా ఉదాహరణ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ (Nizamabad MLA Bajireddy Govardhan). రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు, అన్ని పార్టీలకు చెందిన వారు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలవడం మాట అటుంచితే వీరే కరోనా వ్యాప్తి చేస్తున్నారు. తాజాగా పరీక్షల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కు పాజిటివ్ అని తేలింది. ఆయన భార్యకు నెగెటివ్ రావడం గమనార్హం.

నాలుగు రోజులుగా ఈయనకు ఆరోగ్యం సరిగా లేదని పరీక్షలు చేయగా ఈరోజు కరోనా సోకినట్లు తేలింది. ఆయనను చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. విషాదకరం ఏంటంటే... నిన్న అంటే శనివారం ఈయన వందల మందితో రెండు మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని బీబీ పూర్ తండాలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు , షాదీ ముబారక్ చెక్కులు పంచడానికి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఇపుడు వారంతా చిక్కుల్లో పడ్డారు. తమకు ఎక్కడ కరోనా సోకిందో అని వారంతా భయపడి చస్తున్నారు.

ఎమ్మెల్యే అయి ఉండి... ప్రజలను ఇలా ప్రమాదంలో నెట్టడం ఏంటని... నిజామాబాద్ (Nizamabad) రూరల్ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయన వల్ల మేము ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే కార్యక్రమం అంటే అధికారులు, ఇతర సిబ్బంది, లబ్దిదారులు, స్థానికులు పాల్గొంటారు. ఎంత లేదన్నా 100 మందికి తక్కువ కాకుండా వస్తారు. లాక్ డౌన్ నిబంధనలకు ఇది విరుద్ధం. కానీ ఎవరూ వినరు. అన్ని పార్టీల వారు ఇంతే. ఇలా చేస్తే కరోనా తగ్గే అవకాశమే లేదు.

ఇపుడు వీళ్లందరూ వణుకుతున్నారు (Photo)

Image