కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి

August 09, 2020

డబ్బుంటే కరోనా నుంచి బయటపడొచ్చు అని చాలామందిలో ఇప్పటికీ కొన్ని భ్రమలున్నాయి. వాటిని తగ్గించుకుంటే మీ కుటుంబానికి మంచిది. దేశంలో కరోనా తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. కొద్దిరోజుల  క్రితం తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యే, డీఎంకే లీడరు అన్బళగన్ (DMK leader J Anbazhagan) మరణించారు.

అదింకా మరవకుండానే మరో ఎమ్మెల్యే ఈరోజు మరణించారు. తాజాగా మృతిచెందిన ఎమ్మెల్యే పశ్చిమబెంగాల్ అధికార పార్టీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ (TMC MLA tamonash ghosh) మరణించారు.

గవర్నమెంటు 65 ఏళ్లు పైబడిన వారు, పదేళ్ల లోపు పిల్లలు బయటకు రావద్దు జాగ్రత్త అని చెబుతున్నారు. కానీ లెక్కకు మిక్కిలి డబ్బు, చేతిలో పవర్, ఎలాంటి ఆస్పత్రిలో అయినా చికిత్స తీసుకోగలిగిన శక్తి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించారు.

కానీ వీరి వయసు పెద్ద ఎక్కువేం కాదు. డీఎంకే ఎమ్మెల్యే వయసు 62 కాగా, టీఎంసీ ఎమ్మెల్యే వయసు 60 ఏళ్లు మాత్రమే. ఘోష్ పార్టీలో కీలక వ్యక్తి. నెల రోజుల పాటు చికిత్స తీసుకున్నా ఆయనకు వైరస్ తగ్గలేదు. చివరకు బుధవారం తుదిశ్వాస విడిచారు. 1998 నుంచి అతను టీఎంసీ ట్రెజరర్ గా ఉన్నారు. 3 సార్లు ఫాల్తా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 

ఆయన మరణం పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. 35 సంవత్సరాల పాటు పార్టీకి ప్రజలకు విశేషమైన సేవ చేసిన తమోనాష్ ఘోష్ ను కోల్పోవడం తీవ్రమైన లోటు, విచారకరం అని మమతా బెనర్జీ బాధపడ్డారు.

 పశ్చిమ బెంగాల్ (west bengal) లో ప్రస్తుతం 14728 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 580 మంది చనిపోయారు. తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే మరణం రాష్ట్రంలో కలకలానికి దారితీసింది.