మీ మొబైల్ మీకు డేంజ‌రో కాదో ఇలా తెలుసుకోండి..

August 04, 2020

ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని అర‌చేతిలో ఉంటోన్న స్మార్ట్‌ఫోన్ శాసిస్తోంది. డేటా విప్ల‌వం రావ‌డంతో పాటు డేటా చౌక‌గా దొరుకుతుండ‌డం స్టార్ట్ కావ‌డంతో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ప్ర‌తి ఒక్క‌రి జీవితానికి ఓ నిత్యావ‌స‌ర వ‌స్తువుగా మార‌డంతో పాటు మ‌నిషి జీవితంలో అంత‌ర్భాగంగా మారిపోయింది. అస‌లు స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గ‌డ‌వ‌డం లేదు. మ‌రి ఇంత‌లా మనిషి జీవితాన్ని శాసిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ వ‌ల్ల ప్ర‌మాదాలు లేవా ? అంటే ఉన్నాయ‌నే ప‌రిశోధ‌కులు చెపుతున్నారు.
స్మార్ట్‌ఫోన్ ద్వారా వెలువ‌డే రేడియేష‌న్ వ‌ల్ల ఎన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో ? ప‌్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. అస‌లు ఏ ఫోన్ వాడినా రేడియేష‌న్ ప్ర‌భావం ఎక్కువే. అయితే స్మార్ట్‌ఫోన్‌తో ఇది మ‌రిత తీవ్ర‌త‌రంగా మారుతోంది. అందుకే మ‌నుష్యులు అనేక ర‌కాల అనారోగ్యాల‌కు గుర‌వుతున్నారు. స్మార్ట్ ఫోన్లలో తగినంత రేడియషన్ ఉంటే దాని వల్ల పెద్ద సమస్య ఉండదు. కానీ ఒక లిమిట్ దాటిస్తే మనిషికి డేంజరే.
ఫోన్లలో రేడియషన్ ఎంత ఉండాలి ? ఇప్పుడు మన మొబైల్స్ లో ఎంత ఉంది ? మ‌నం వాడే ఫోన్ వ‌ల్ల మ‌నం ప్ర‌మాదంలో ఉన్నాయా ? అన్న‌ది తెలుసుకుంటే మ‌నం చాలా వ‌ర‌కు ఈ రేడియేష‌న్ భారీ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఫోన్ల‌లో రేడియేష‌న్ తెలుసుకునేందుకు ఓ చిన్న చిట్కా కూడా ఉంది. ఇందుకోసం మ‌న మ‌న ఫోన్ నుంచే  *#07# కు డయల్ చేయాలి.
ఆ నెంబర్ డయల్ చేయగానే మీ ఫోన్లో రేడియేషన్ లెవెల్ ఎంతో ఉందో మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద కనబడుతుంది. స్థాయి.. 1.6w/kg కంటే తక్కువ స్థాయిలో ఉంటే పర్లేదు. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లే. వెంట‌నే మీరు ఫోన్ మార్చ‌క‌పోతే.... మీరు మీ అనారోగ్యం స్వయంగా కొని తెచ్చుకున్న‌ట్టే..!