ఫోన్ కొనటానికి షాపుకు వెళితే...

August 04, 2020

దాదాపు రెండు నెలల పాటు ఇంట్లోనే ఉండిపోయిన వారంతా.. ఇప్పుడిప్పుడే బయటకు వెళ్లే అవకాశం లభిస్తోంది. అంతేకాదు.. అన్ని రకాల షాపులు కూడా తెరిచే అవకాశం ఉంది. ఇలాంటివేళలో.. జీవితంలో ఒక భాగమై.. శరీరంలో ఒక అవయువంగా మారిన సెల్ పోన్లు కొనేందుకు వెళితే.. చాలా సిత్రమైన అనుభవం ఎదురవుతుందని చెబుతున్నారు. గతంలో మాదిరి మొబైల్ షాపులోకి వెళ్లి.. అక్కడున్నమోడళ్లను చూడటం.. నచ్చింది కొనుక్కోవటం లాంటివి ఉండవంటున్నారు.
చాలా షాపుల్లోకి కస్టమర్లను రానిచ్చే అవకాశమే ఉండదని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ కొనటానికి షాపుకు వెళితే.. బయటే ఉంచే అవకాశమే ఎక్కువట. మీరు కొనాలనుకున్న మొబైల్ ఫోన్ వివరాలు అడిగి.. ధర చెబుతారని.. గతంలో మాదిరి డమ్మీ పీసులు చూపించి.. నచ్చిన మొబైల్ ఫోన్ కొనే వీలు ఉండదని చెబుతున్నారు.
షాపుకు వెళ్లటానికి ముందే.. ఏ కంపెనీకి చెందిన ఏ మోడల్ ఫోన్ ను కావాలో డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అలా అయితేనే సులువుగా ఫోన్లు దొరికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ మాత్రమే కాదు.. చాలా వస్తువులకు సంబంధించి ఇలాంటివే ఎదురుకానున్నాయి. ఇప్పటివరకూ ఎప్పుడూ ఎదురుకాని ఎన్నో సన్నివేశాలు ఇకపై ఎదురుకావటం ఖాయమంటున్నారు. సో.. బీ రెడీ.