జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

August 05, 2020

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు పీఎంవో తెలిపింది. ప్రతిసారి రాత్రి 8 గంటలకు ఇలాంటి ప్రసంగాలు చేసే ప్రధాని నరంద్ర మోడీ ఈసారి సాయంత్రం 4 గంటలకు ముహుర్తం పెట్టడం గమనార్హం.

ఇక ఈ ప్రసంగంపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.

దేశంలో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉంది. దాని గురించి మాట్లాడతారా?

ఈరోజు 59 చైనా యాప్స్ ని నిషేధించారు. దాని గురించి మాట్లాడతారా?

చైనా యాప్స్ నిషేధం గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి నిషేధించారు... మరి చైనా వస్తువుల సంగతి, దాని గురించి మాట్లాడతారా?

లేక చైనాపై పోరాటానికి ముందుడుగు వేస్తూ ఏదైనా నిర్ణయం తీసుకుంటారా?

మరోవైపు రేపటితో లాక్ డౌన్ ముగియనుంది. 

దాని గురించి ఏమైనా మొదటి లాక్ డౌన్ లాగా మళ్లీ ప్రకటిస్తారా?

మొత్తానికి ఈ ప్రసంగంపై చాలా ఆసక్తి నెలకొంది.