మోడీ కొత్త ఐడియా ఫెయిలైనట్లేనా?

July 13, 2020

బీసీని కాబట్టే నాపై విమర్శలు అంటూ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌ మోడీ ఓ స‌భ‌లో వ్యాఖ్యానించ‌డం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ప్రధాని స్థాయిలో ఉండి కుల రాజకీయాలు మాట్లాడటం ఆస‌క్తిక‌రంగా మారింది. మోడీ కామెంట్ల నేప‌థ్యంలో రాజ‌కీయ విశ్లేష‌కులు ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఉన్న ప్రధానుల్లో ఎవరు కుల ప్రస్తావన తీసుకురాలేదని అయితే, నరేంద్రమోడీ మాత్రం ప్రధాని హోదాలో కులాల ప్రస్తావన తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారని ప్ర‌స్తావిస్తున్నారు. ఐదేళ్లల్లో గుర్తురాని బీసీలు మోడీక ఇప్పుడు గుర్తు రావ‌డం చిత్రంగా ఉందంటున్నారు.

ప్రధాని హోదాలో ఉండి కుల, మతాలకు అతీతంగా వ్యహారించాల్సిన వ్యక్తి కుల రాజకీయలు చేస్తు ప్రధాని పదవికి మచ్చ తెచ్చారు. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు ప్రధాని పదవీ కోసం నరేంద్రమోడీ ఎన్ని వేషాలైనా వేయటానికి సిద్ధంగా ఉన్నారని ఈ వ్యాఖ్యాలతో అర్థమౌతోంది. 1984లో నరేంద్రమోడీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర షోషించారని అంటున్నారు. ఇప్పుడు ఎందుకు కుల ప్రస్తావన తీసుకు వస్తున్నారని ప్ర‌స్తావిస్తున్నారు. మ‌రోవైపు బీసీ జ‌పం చేస్తున్న మోదీ హ‌యాంలో జ‌రిగిందేంట‌ని చ‌ర్చించుకుంటున్నారు. మోడీ ప్రధాని అయిన తరువాత బడుగుబలహీన వర్గాలపై దాడులు 12.5% పెరిగాయని చెప్తున్నారు. వీపీ సింగ్‌ మండల్‌ కమిషన్‌ను నిలిపివేసింది బీజేపీ ప్రభుత్వం అనే విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని చెప్తున్నారు. 2011 జస్టిస్‌ ఈశ్వరయ్య కమిషన్‌ను ప్రవేశపెట్టి బీసీ కులాల కేటగిరైజేషన్‌ను ప్రతిపాదిస్తే బీజేపీ దానిని అమలు చేయడంలో విఫలమైంద‌ని వెల్ల‌డిస్తున్నారు.

అలాంటి మోడీ త‌న‌ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను ఉపయోగించుకుంటున్నార‌ని చెప్తున్నారు. బీసీల అభివృద్ధిపై నరేంద్రమోడీకి చిత్తశుద్ధి ఉంటే.. బీసీలు 50%పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని సూటిగా ప్ర‌శ్నించారు. దేశవ్యాప్తంగా బీసీలకు బీజేపీ ఎన్ని సీట్లు ఇచ్చిందనే విరాల‌ను వెల్ల‌డించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం గుజరాత్‌లో మత ఘర్షణలు (గోద్రా అల్లర్లు) సృష్టించారు. అదే విధంగా ప్రధాని పదవి కోసం నరేంద్రమోడీ బీసీల ప్రస్తావన తీసుకువ‌స్తున్నార‌ని ఇంకొంద‌రు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.