ఇలాంటి ఐడియాలు మాత్రం మోడీకి భలే వస్తాయి 

August 08, 2020
CTYPE html>
ఏదైనా పబ్లిసిటీ చేయడంలో మోడీ దిట్ట. జనాలందరికీ ఏదైనా పెద్ద విషయం చెప్పాలనకుంటే... దానికి ఒక ప్రత్యేక సమయం మాత్రమే మోడీ ఎంచుకుంటారు. అలా మోడీ ఎంచుకున్న సమయం.. రాత్రి 8 గంటలు. మోడీ రాత్రి 8కి జాతి ని ఉద్దేశించి ప్రసంగిస్తారు అంటే జనాలు చాలా అలెర్ట్ అయిపోతారు.
అలాగే మోడీ ఒక విషయాన్ని ప్రచారంలోకి తేవాలనుకుంటే మన్ కీ బాత్ ను ప్రభావవంతంగా వాడుతారు. ఎక్కడో మారుమూల జరిగిన అభినందించదగ్గ విషయాలను అందులో చెబుతారు మోడీ. ఈ మార్గంలో ఎంతో మంది మంచి గుర్తింపు పొందారు. ఈ ఘటనలో మరెంతో మందిలో స్ఫూర్తి నింపాయి. 
తాజాగా దేశ వ్యాప్తంగా వైద్యులు చేస్తున్న సేవ అనిర్వచనీయంగా ఉంది. కేవలం ముట్టుకుంటే సోకే కరోనా వ్యాధికి వైద్యం చేయడంలో డాక్టర్లు, నర్సుల పాత్ర అమోఘం. వంద శాతం కరోనా వారికి సోకే అవకాశం ఉన్నా...సమాజంలో తమను అందరూ భయంగా చూస్తున్నా కూడా సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిలో మరింత ధైర్యం నింపడానికి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికి మోడీ నేరుగా ఒక సాధారణ నర్సుకు ఫోన్ చేశారు. పుణెలోని ఓ ఆస్పత్రిలో ఉన్న చాయ జగతాప్ అనే నర్సుకు మోడీ ఫోన్ చేశారు. ఆమె బాగోగులు విచారించారు. ఎంత ఇబ్బంది అని... విధులు నిర్వహించడం తమ విద్యుక్త ధర్మంగా భావిస్తామని ఆ నర్సు చెప్పిన మాటలకు మోడీ సంతోషపడ్డారు. ప్రతిఒక్కరిలో ఈ స్ఫూర్తి ఉండాలని... మనం కచ్చితంగా కరోనాను జయిస్తామని మోడీ చెప్పారు.