ప్రతి పక్షాలకు భలే ట్విస్ట్ ఇచ్చిన మోడీ

August 08, 2020

కరోనా విషయంలో కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ, సోనియా మోడీని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇంతకాలం సైలెంటుగా ఉన్న మోడీ తాజాగా విమర్శకులకు భలే ట్విస్ట్ ఇచ్చాడు. వారు తనను రాజీకంగా టార్గెట్ చేస్తే మోడీ మాత్రం... ఒకసారి మాట్లాడుదాం, సలహాలు తీసుకుంటాను రండి అంటూ తన ఇమేజ్ పెంచుకుంటున్నాడు.  కొద్ది సేపటి క్రితం మోడీ సోనియా, రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్ తో పాటు దేశంలోని పలు రాజకీయ ప్రముఖులకు మోడీ ఫోన్ చేశారు.

వీరే కాకుండా దేశంలోని  వివిధ పార్టీల అగ్ర నాయకులతో మోడీ సంప్రదింపులు జరిపినట్లు నేషనల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. వీలైనంత తక్కువ ప్రాణ నష్టం, అతి తక్కువ రోగుల సంఖ్యతో కరోనాను కంట్రోల్ చేయడానికి మోడీ విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ సక్సెస్ కనుక సాధ్యపడితే అంతర్జాతీయంగా మోడీ మరింత బలపడతారు. అందుకే మోడీ కరోనాపై యుద్ధానికి ఎంతయినా రాజీ పడుతున్నారు. తనకు నచ్చిన వ్యక్తలు, నచ్చని వ్యక్తు సలహాలు కూడా తీసుకుంటున్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడలతో పాటు.. పాలనా అవగాహనలో, రాజకీయంలో ఉద్దండులు అయినటువంటి మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌లకు మోడీ ఫోన్ చేసి కోవిడ్-19 వ్యాప్తిని నివారించడంలో సలహాలు కోరారు.

ఇంకా ఈ జాబితాలో సమాజ్ వాదీ పార్టీ అగ్ర నేత ములాయం సింగ్ యాదవ్, తనయుడు అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి-పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పంజాబ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ వంటి చాలామంది ఉన్నారు. వారి సలహాలన్నీ రికార్డు చేసుకుని... పనికొచ్చే ప్రతి పాయింటును వినియోగించుకోవాలని పీఎంవోకు మోడీ ఆదేశించారు.

ఇప్పటికే మోడీ... పలుమార్లు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజాగా విపరీంగా ఫాలోయర్లు ఉండే క్రీడాకారులతో కాన్ఫరెన్స్ పెట్టి వారి సలహాలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించడానికి మీ సోషల్ మీడియా మాధ్యమాలు వినియోగించమంటూ కోరారు. మరుసటి రోజే క్రీడాకారులు మోడీని ఫాలో అయిపోయారు. సినిమా వాళ్లు కూడా కరోనాపై చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తున్న మోడీ వారిని అభినందించారు. ఇటీవలే అతను చిరంజీవికి ట్వీట్ పెట్టిన విషయం తెలిసిందే. ఇదంతా ఒకెత్తు... కానీ అడగకుండానే రాజకీయ ప్రత్యర్థుల్ని ఈ పోరులో భాగం చేయడం మోడీ అందరి మనసులు గెలుచుకున్నాడు.