ట్రంప్ ను మోడీ చీటింగ్ చేశాడా?

August 12, 2020

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న స్పందించే తీరు గురించి ప‌రిచ‌యం అంత‌కంటే అవ‌స‌రం లేదు. అయితే తాజాగా ఆయ‌న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి కూడా స్పందించారు.  డెబ్బై ల‌క్ష‌ల మంది జ‌నం స్వాగ‌తం ప‌లుకుతార‌ని డోనాల్డ్ ట్రంప్ త‌న ప‌ర్య‌ట‌న‌కు ముందు ఓ కామెంట్ చేశారు.  దాంతో ట్రంప్ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' నేపథ్యంపై ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేసిన వర్మ..ఇందులో త‌న‌దైన శైలిలో కెలికారు.
ఇవాళ అహ్మాదాబాద్ చేరుకున్న ట్రంప్‌కు.. ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.  స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఎయిర్‌పోర్ట్ నుంచి స‌బ‌ర్మ‌తి ఆశ్రమం,  ఆ త‌ర్వాత ఆశ్ర‌మం నుంచి మొతెరా స్టేడియం వ‌ర‌కు ల‌క్ష‌లాది మంది జ‌న‌నీరాజ‌నం ప‌లికారు. అన్ని వీధుల్లోనూ న‌మ‌స్తే ట్రంప్ అంటూ నినాదాలు హోరెత్తాయి. రోడ్డు వెంట వివిధ రాష్ట్రాల‌కు చెందిన క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు.
అహ్మాదాబాద్‌లో జ‌రిగే రోడ్డు షోకు భారీ సంఖ్య‌లో జ‌నం వ‌స్తార‌ని మోదీనే త‌న‌కు చెప్పిన్న‌ట్లు ట్రంప్ అన్నారు. అయితే దీనిపై వ‌ర్మ స్పందిస్తూ...‘‘ట్రంప్ బలహీనతపై మోదీ ఆడిన గేమ్ నాకు చాలా బాగా నచ్చింది. కోటి మందిని రప్పిస్తానని చెప్పి పర్యటన ఖరారు చేయించారు. నిజానికి నమస్తే ట్రంప్ సభకు వచ్చింది లక్షమందే`` అంటూ కెలికారు. ``స్టేడియంలో ఉన్న లక్ష మందిని చూసి.. కోటి మందిగా ట్రంప్ ఊహించుకుని ఉంటారు. కానీ ఇందులో భారత్ కు ప్రమాదం పొంచిఉంది. నమస్తే ట్రంప్ సభకు లక్ష మందే వచ్చారన్న చేదు వాస్తవం గ్రహిస్తే.. ట్రంప్ ఇండియాతో ట్రేడ్ డీల్ క్యాన్సిల్ చేసుకునే ప్రమాదముంది. అసలే అవతలివాళ్లపై ప్రతీకారం తీర్చుకునే విషయంలో ట్రంప్ జగమొండి``అంటూ అటు అమెరికా వారికి...ఇటు విప‌క్షాల వారికి రాని ఆలోచ‌న‌ల‌ను సైతం..త‌న ట్వీట్లో వ‌ర్మ ప్ర‌స్తావించారు.