మోడీ ఆప్త మిత్రుడికి కరోనా 

August 12, 2020

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచదేశాలన్నీ గజగజలాడుతున్నాయి. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్ వేలాది మందిని పొట్టనపెట్టుకుంది. చైనా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్, అమెరికాలు ఈ వైరస్ బారిన పడి అతలాకుతలమవుతున్నాయి. బ్రిటన్ ప్రధాని మొదలుకొని సామాన్యుడి వరకు అంతా ఈ వైరస్ బాధితులే. పేద..ధనిక...తన....పర భేదం లేని ఈ మహమ్మారి వైరస్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు సోకింది. నెతన్యాహుతో పాటు ఆయన సలహాదారు రివ్కా పలోచ్ కు కరోనా పాజిటివ్ అని తేలిన కొద్ది గంటల్లోనే నెతన్యాహుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెతన్యాహుకూ కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. గత 15 రోజులుగా నెతన్యాహును, పలోచ్ ను కలిసిన వారి జాబితాను వెదికే పనిలో అధికారులు పడ్డారు. 

వాస్తవానికి మార్చి 15నే నెతన్యాహుకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే, ఆ పరీక్షల్లో నెతన్యాహుకు కరోనా నెగెటివ్ అని తేలింది. అయితే, ఆ తర్వాత నెతన్యాహు హోమ్ క్వారంటైన్ లో ఉండడంగానీ...ఇంటి నుంచి కార్యకలాపాలు నిర్వహించడం వంటివి కానీ చేయలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నెతన్యాహు కరోనా నెగెటివ్ అని తేలిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోలేదని అంటున్నారు. అందుకే, నెగెటివ్ అని తేలిన రెండు వారాలకు నెతన్యాహు కరోనా పాజిటివ్ జాబితాలో చేరారని...కరోనాను నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు. భారత ప్రధాని మోడీకి సన్నిహితుడైన నెతన్యాహు కరోనాబారిన పడడంతో ఇజ్రాయెల్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4247కు చేరింది. ఇప్పటికే ఇజ్రాయెల్ లో కరోనా బారిన పడి 15 మంది చనిపోయారు.