చంద్రబాబుకు మోడీ ఇన్విటేషన్ 

August 11, 2020

దేశ వ్యాప్తంగా ఇపుడు చర్చ నడుస్తున్నది చైనా వ్యవహారం గురించే. ప్రధాన వినియోగదారీ మార్కెట్ గా ఉన్న ఇండియాతోనే చైనా ఇంత దారుణంగా వ్యవహరిస్తుందా అంటూ ఇండియన్స్ మండిపడుతున్నారు.

చైనా వాళ్లు తిని ప్రతి వంద రూపాయల్లో 30 రూపాయలు మన వద్ద నుంచే వస్తాయి. అంత పెద్ద మార్కెట్ మనది. ఫర్నీచర్, గృహోపకరాణాలు, ఫోన్లు, సాఫ్ట్ వేర్లు, మందులకు ముడిసరుకులు ఇలా ఎన్నో మనం చైనా నుంచి కొంటున్నాం. మన వల్ల లక్షల కోట్లను చైనా కంపెనీలు ఆర్జిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాజ్య విస్తరణ కాంక్షతో చైనా మన భూభాగం మీద కన్నేయడం ఏ భారతీయుడికీ నచ్చలేదు.  దీంతో బాయ్ కాట్ చైనా అంటూ మన వద్ద ఉద్యమం లా మొదలైంది. అయితే... చైనాను మన జీవితంలో బాగు చేసుకున్నాం. చైనా నుంచి బయటపడటం ఈరోజు రేపట్లో జరిగేది కాదు. ఇప్పుడు చాలా వ్యూ హాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది మనం. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఒక అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

దీనికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాన ప్రతిపక్షాలతో కూడా చర్చించడానికి మోడీ సమావేశం ఏర్పాటుచేశారు. ఇది ఆన్ లైన్లో జరిగే సమావేశం. దీనికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రధాని మోడీ ఆహ్వానించారు. అఖిల పక్షభేటీ ఈరోజే జరగనుంది.

చైనా విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయంపై ప్రధానమంత్రి అఖిలపక్ష నేతల సలహాలు స్వీకరిస్తారు.  చైనా విషయంలో భారత్ వ్యూహం ఎలా ఉండాలన్నదానిపై అందరితో చర్చిస్తారు. 

చైనా ఇటీవల సంతోష్ బాబుతో పాటు మరో 20 మంది చనిపోయిన ప్రాంతం గుండా ప్రవహించే గాల్వన్ నది మాదే అంటోంది.  లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లు కూడా మావే అంటోంది చైనా. ఈ నేపథ్యంలో చైనాకు గట్టి గుణపాఠం చెప్పాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. 

ఈ విషయంలో అన్ని పార్టీలో మోడీకి అండగా నిలుస్తున్నాయి. దేశభద్రతకు సంబంధించిన విషయం కాబట్టి.. ఇక్కడ రాజకీయాలకు తావే లేదు. చైనాతో పోరాటం అంటే మనం అంతా భారతీయులం అవుతాం. ఒక్కటై పోరాడతాం.