ఆ సంచలనం వైపు మోడీ

August 07, 2020

తాను సోషల్ మీడియా వదిలేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రధాని మోడీ అలా ప్రకటించాడో లేదో అది వైరల్ అయిపోయింది. వద్దు సార్ అని ఒకవర్గం కోరితే... వదిలేయాల్సింది సోషల్ మీడియా కాదు ద్వేషం అని కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే... మోడీ వదిలేస్తానని ప్రకటించలేదు. అలాంటి ఆలోచన చేస్తున్నట్లు మాత్రమే చెప్పారు. 

అయితే, మోడీ ఆలోచనలోని డేంజర్ యాంగిల్ ను కాంగ్రెస్ నేత శశిథరూర్ విశ్లేషించారు. ఆయన మాటలు సోషల్ మీడియానే కాదు, ప్రజలను షాక్ కు గురిచేశాయి. దేశంలో సామాజిక మాధ్యమాలను నిషేధించే క్రమంలో మోడీ వేస్తున్న తొలి అడుగు వాటి నుంచి తాను దూరమవడం అని శశిథరూర్ విశ్లేషించారు. సోషల్ మీడియా మంచి - చెడు రెండింటినీ ప్రచారం చేస్తుందనే విషయం మోడీకి కూడా తెలుసని థరూర్ అన్నారు.  రాజకీయ విమర్శకుడు అయిన సుధీంద్ర కులకర్ణి కూడా ఇదే అనుమానం వ్యక్తంచేశారు. 

అయితే... అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అయిన మోడీ తాజాగా కొత్త ఝలక్ ఇచ్చారు. ఈ మహిళా దినోత్సవం రోజు నా సోషల్ మీడియా అక్కౌంట్స్ అన్నీ లక్షలాది మందిలో స్ఫూర్తి నింపగల వారికి ఇచ్చేస్తారు. అలాంటి ఇన్ స్పైరింగ్ వ్యక్తులు, సంస్థల గురించి షేర్ చేయండి అంటూ మోడీ ప్రకటించారు. దీంతో ఒక్కసారి సోషల్ మీడియా వ్యవహారం మారిపోయింది.