మోడీకి జగన్ రెండు కోరికలు

July 10, 2020

మంచి మెజారిటీ సీట్లతో అయితే జగన్ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు గాని... అతను ఎవరి ఒడిలోనో కూర్చుని పాలిస్తున్న ఫీలింగ్ లో ఉన్నాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం జగన్ ను వెంటాడుతున్న కేసులే. దీంతో జగన్ కి తప్పనిసరిగా కేంద్రంతో సానుకూలంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది . ఇదొక్కటే కాదు... ఏపీ ఆర్థిక లోటు కూడా జగన్ కు పెద్ద గుదిబండే. అసలే నిధుల లేమి, సమకూర్చుకోవడానికి అనుభవ లేమి. దీంతో బడ్జెట్ కసరత్తతోనే జగన్ బెంబేలెత్తిపోతున్నారు. లక్కీలో అన్ లక్కీ అంటే ఇదే. ఏ కేసు లేకుండా ముఖ్యమంత్రి అయ్యి ఉంటే.. స్టాలిన్ లాగా మోడిని లెక్కచేయకుండా మాట్లాడే పరిస్థితి ఉండేది. కానీ అతని చరిత్రే అతనికి అడ్డంకి అయ్యింది.
సరే ఇక చేసేదేముంది అని జగన్ బీజేపీతో సరెండర్ అయినట్టే కనిపిస్తున్నాడు. ఢిల్లీలో జరిగిన మొదటి ప్రెస్ మీట్లోనే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోయింది. మోడీని రిక్వెస్ట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేమని జగన్ అనేశారు. ఈ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే కాదు... ఇలాంటి మాటలు భవిష్యత్తులో జగన్ నోటి నుంచి చాాలా వస్తాయి. దీనికి కారణం... జగన్ కోరిన రెండు కోరికలకు తన గాడ్ ఫాదర్ మోడీ ఓకే చెప్పడమే కారణం.
జగన్ కోరిన ఆ రెండు కోరికలు ఏమంటే.... ఒకటి కేసులతో తనను ఇబ్బంది పెట్టవద్దు అని ఒకటి, వచ్చే ఎన్నికల నాటికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 225 చేయమని ఒకటి... రెండు కోరగా మోడీ నుంచి రెండింటికీ అభయం లభించింది. కాకపోతే ఈ రెండు తీర్చిన మోడీ జగన్ ను అనేక కోరికలు కోరుతున్నాడు. వాటిని జగన్ ఆఘమేఘాల మీద పరిష్కరిస్తున్నాడు. తన శత్రువు చంద్రబాబుపై పగ తీర్చుకోవడానికి ఏపీలో సీబీఐ బ్యాన్ ఎత్తేయమని మోడీ అడిగాడు. జగన్ ఎత్తేశాడు. టీటీడీ బోర్డులో కూడా బీజేపీ కొన్ని రెకమెండేషన్లు పంపిందట. దానికి కూడా జగన్ ఓకే చేశాడు. ఇవి ఇక్కడితో ఆగవు. బీజేపీ నుంచి వస్తూనే ఉంటాయి. జగన్ తీరుస్తూనే ఉండాలి.