బాలీవుడ్ హీరోకి షాకిచ్చిన మోడీ...

July 12, 2020

ఇది మరీ విచిత్రంగా ఉంది... ప్రధాని మీద ఇలాంటి మాటలు ఏంటి అనుకోకండి. అక్షయ్ భార్యను మోడీ ట్విట్టరులో ఫాలో అవుతున్నాడు. ఆమె విమర్శలను పరిశీలిస్తున్నాడు... ఇంతకీ ఇదెలా తెలిసిందో తెలుసా?

 ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ రాజ‌కీయ నేత‌గా వైరి వ‌ర్గాల‌పై ఏ మేర పంచ్ లేస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మోదీ టార్గెట్ చేశారంటే... అవ‌త‌లి వాళ్ల‌కు త‌డిసిపోవాల్సిందే. డొంక తిరుగుడు లేకుండా సూటిగా సుత్తి లేకుండా మోదీ సంధించే పంచ్ ల‌కు ప్ర‌త్య‌ర్థులు గిల‌గిల్లాడాల్సిందే. పాలిటిక్స్ లో ఇంత‌గా ప‌వ‌ర్ ఫుల్ పంచ్ లేసే మోదీ... లీజ‌ర్ లో మాత్రం చాలా కూల్ గా, ఫ‌న్నీ పంచ్ లు కూడా వేస్తార‌ని కూడా చెప్పాలి. అందుకు నిద‌ర్శ‌నంగా ఇప్పుడు వైర‌ల్ గా మారిన ఓ ఇంట‌ర్వ్యూ నిలుస్తోంది. ప్ర‌స్తుతం సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో య‌మా బిజీగా ఉన్న మోదీ.... బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ కు ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

పాలిటిక్స్ తో ఏమాత్రం సంబంధం లేని వ్య‌వ‌హారాల‌తోనే సాగిన ఈ ఇంటర్వ్యూలో అక్ష‌య్ అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ మోదీ చాలా ఓపిగ్గా, తీరిక‌గానే బ‌దులిచ్చారు. ఈ సంద‌ర్భంగా అక్ష‌య్‌, ట్వింకిల్ ఖ‌న్నా దంప‌తుల‌పైనా మోదీ... అక్ష‌య్ ఎదురుగానే ఫ‌న్నీ పంచ్ లేశారు. ట్వింకిల్ ఖ‌న్నాకు కోపం ఎక్కువేన‌ని, అయితే ఆ కోపాన్ని అంతా భ‌ర్త అయిన అక్ష‌య్ మీద కాకుండా త‌న‌పై చూపిస్తుంటార‌ని, ఫ‌లితంగా అక్ష‌య్ తో పాటు ఆయ‌న ఫ్యామిలీ మొత్తం ఆమె కోపం నుంచి త‌ప్పించుకుంటుంద‌ని సెటైర్ వేశారు. గ‌తంలో శానిట‌రీ న్యాప్ కిన్స్ రేట్ల‌ను భారీగా పెంచేస్తూ మోదీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై ట్వింకిల్ ఖ‌న్నా తీవ్రంగానే మండిప‌డ్డారు. ఈ విష‌యంలో మోదీ నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ ఆమె ఘాటు కామెంట్లు కూడా చేశారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను అక్ష‌య్ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్న మోదీ... నాటి విష‌యాన్ని ప్ర‌స్తావించ‌కుండానే... ట్వింకిల్ ఖ‌న్నా... వ‌చ్చిన కోపాన్నంతా త‌న‌పైనే చూపిస్తార‌ని ఫ‌న్నీ కామెంట్ చేశారు.

వ‌చ్చిన కోపాన్ని త‌న‌పై వేసే ట్వింకిల్‌... కుటుంబంపై మాత్రం దానిని వ్య‌క్తం చేసే అవ‌కాశం ఇంకెక్క‌డుంటుంద‌ని వ్యాఖ్యానించారు. *మీపై వ‌చ్చే కోపాన్ని ఆమె నాపై వేసేస్తారు. ఇక మీకంతా శాంతే క‌దా* అంటూ మోదీ వేసిన ఈ ఫ‌న్నీ పంచ్ ను అక్ష‌య్ కూడా న‌వ్వుతూనే స్వాగ‌తించారు. మోదీ ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నంత సేపూ అక్ష‌య్ న‌వ్వుతూనే ఉండిపోయారు. ఇదిలా ఉంటే... త‌న కోపంపై మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ట్వింకిల్ కూడా స్వాగ‌తించార‌నే చెప్పాలి. ప్ర‌ధాన మంత్రి అయినా కూడా త‌న ప‌నిని కూడా మోదీ ప‌రిశీలిస్తూనే ఉన్నార‌న్న విష‌యం త‌న‌కు అర్థ‌మైపోయింద‌ని ఈ సంద‌ర్భంగా మోదీ వ్యాఖ్య‌ల‌పై ట్వింకిల్ స్పందించారు.