మోడీ రిక్వెస్ట్! అసలు కారణం అదేనా..?

August 05, 2020

 

దేశంలోని ప్రముఖుల లిస్ట్ తీసుకొని స్వయంగా నరేంద్ర మోడీ రిక్వెస్టులు పంపుతున్నారు. ఉన్నట్టుండి సడెన్ గా దేశంలోని సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలందరికీ మోడీ వరుస ట్వీట్స్ చేయడంతో అంతా అలెర్ట్ అయ్యారు. అయితే ఆ ట్వీట్లలో మోడీ చేసిన రిక్వెస్ట్ ఏంటో తెలుసా..? దేశంలోని ఓటర్లందరినీ చైతన్య పరచాలని సదరు వ్యక్తులకు విజ్ఞప్తి. అయితే మోడీ అలా ట్వీట్స్ పెట్టారో లేదో.. ఈ రిక్వెస్టుల వెనుక ఏదో వ్యూహం దాగిఉంది అనే కోణంలో చర్చలు స్టార్ట్ అయ్యాయి రాజకీయ వర్గాల్లో.

రాహుల్ గాంధీతోపాటు ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే అన్ని రాజకీయ పార్టీల నేతలు, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, జర్నలిస్టులు, సినీ స్టార్లు, మీడియా అధినేతలు.. ఇలా ఎవ్వరినీ వదలలేదు మోడీ. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రముఖులంతా ప్రజలను ప్రభావితం చేయాలని ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ లిస్టులో బాలీవుడ్ అగ్రహీరోలు, హీరోయిన్లు, దర్శకులు కూడా ఉన్నారు. సౌత్ ఇండియా నుంచి అయితే ఇద్దరు స్టార్ హీరోలను ఉద్దేశించి మోడీ ట్వీట్ చేశారు. అందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు కాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇంకొకరు. ఎన్నో సినిమాల ద్వారా లక్షల మంది ఆధారాభిమానాలు సంపాదించిన మీరు.. ఓటు హక్కు వినియోగించుకునేలా అందరినీ చైతన్య పర్చాలని కోరారు.

మోడీ రిక్వెస్ట్ చేసిన సినీ తారల్లో అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, రణవీర్, రణబీర్, విక్కీ కౌశల్, దీపిక పదుకొనె, అలీయాభట్, అనుష్క శర్మ, నాగార్జున, మోహన్ లాల్ తదితరులు ఉండగా.. పారిశ్రామిక వేత్తల్లో ఆనంద్ మహేంద్ర, రతన్ టాటా, అశిష్ చౌహాన్ ఉన్నారు. ఇక క్రీడాకారుల్లో శ్రీకాంత్ కిదాంబి, పీవీ సింధూ, సైనా, సచిన్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనిలు ఉన్నారు.

అయితే ఓటర్లను చైతన్య పరచండి అని మోడీ.. ప్రముఖులను కోరడం బాగానే ఉంది కానీ.. దీని వెనుక ఆయన ఏం పన్నాగం పన్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. మోడీ ఈ రకంగా బీజేపీని ప్రమోట్ చేసుకుంటున్నాడా? అనే కోణంలో విశ్లేషిస్తున్నారు కొందరు. ఏదీ ఏమైనా అందరూ ఓటేయాలన్న మోడీ కోరిక సరైనదే అని చెప్పుకోవచ్చు. అయితే దాని వెనుక ఎలాంటి స్వార్ధపూరిత ఆలోచనలు లేనంతవరకు! ఏమంటారు?