అవును నిజమే! మోడీ ఇలా రివర్సయ్యారేంటి..?

May 29, 2020

భారత ప్రధాని లాజిక్కులే వేరు. లాజిక్కులతో మ్యాజిక్కులు చేసి చివరికి బుట్టలో పడేయటం ఆయనకు అలవాటే కదా! కాబట్టే గుజరాత్ రాష్ట్రానికి అన్నేళ్లు సీఎం గా చేయగలిగారు. ఇక ఇప్పుడు దేశంలో కూడా అలాగే తిష్ట వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యర్థుల విషయంలోనూ ఆయన వేసే ఎత్తుగడలే వేరు. తనకు సాటిరారెవ్వరు! అనే స్టైల్ లో ఆయన స్కెచ్ వేస్తుంటారు. అలాంటిదే తాజాగా జరుగుతున్న సీన్.. ఆ వివరాలు మీరే చూడండి.

నేను దేశానికి చౌకీదార్ (కాపలాదారు) అని చెప్పుకునే మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విరుచుకుపడుతున్నారు. చౌకీదార్ అంటూ మోడీ నినాదంతోనే పంచ్ వేస్తూ ఈ చౌకీదార్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారు దేశం విడిచిపోతుంటే ఏం చేశారు? అలాగే రాఫెల్ డీల్ విషయంలో ఏం చేశారంటూ ప్రశ్నించడంతో దేశంలో రాహుల్ మాటలు హాట్ టాపిక్ గా మారాయి. రాహుల్ స్టార్ట్ చేసిన చౌకీదార్ పంచ్ తీవ్రత మొదట్లో పెద్దగా లేకున్నా ఆ తర్వాత దేశమంతా అర్థంచేసుకున్నారు. దీంతో దీనికి రివర్స్ పంచ్ వేయాలని బలంగా ఫిక్స్ మోడీ ఊహించని స్కెచ్ వేశారు. రాహుల్ అంటున్న అదే చౌకీదార్ పదంతో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

రాహుల్ ఏ పదాన్ని పట్టుకొని తనపై విరుచుకుపడుతున్నారో.. అదే పదాన్ని తన పేరుకు ముందు పెట్టుకోవటం ద్వారా ఎదురుదాడికి దిగాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా చౌకీదార్ పేరును తమ పేర్ల ముందు పెట్టుకోవాలన్న మోడీ మాటను బీజేపీ నేతలు ఫాలో కావటం, ఇప్పుడీ వ్యవహారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రకంగా రాహుల్ మాటకు అదే మాటతో సమాధానం చెప్పటం ద్వారా ఇష్యూను న్యూట్రల్ చేసే పనిలో పడ్డారు మోడీ. తాజాగా ప్రధాని మోడీ మొదలు హోంమంత్రి రాజ్ నాథ్, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తమ సోషల్ మీడియా ఖాతాల్లో తమ పేరుకు ముందు చౌకీదార్ పదాన్ని చేర్చుకొని .. రాహుల్ తమపై చేస్తున్న విమర్శలకు పరిహాసం చేసే కార్యక్రమాన్ని షురూచేశారు. అంతేకాదు ఈ ఐదేళ్ల పదవీ కాలంలో తాము చేసిన మంచి పనులంటూ చిన్న వీడియోలతో ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ రకంగా రాహుల్ చేసే నెగిటివ్ ప్రచారాన్ని తమ పాజిటివ్ ప్రచారంతో బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మోడీ. చూశారా.. ఎంతైనా మోడీ