అవును.. మోడీ అనే ప్ర‌ధాని మాట్లాడిన మాట‌లే ఇవి!

July 12, 2020

మొహ‌మాటం మిస్ అయ్యింది. విలువ‌లు గంగ‌లో క‌లిపేశారు. గెలుపు త‌ప్ప మ‌రికేమీ ముఖ్యం కాద‌నుకున్న వేళ‌.. నోటి నుంచి ఎలాంటి మాట‌లు వ‌స్తాయో.. ఇప్పుడు ప్ర‌ధానమంత్రి కుర్చీలో కూర్చున్న మోడీ నోటి నుంచి అవే మాట‌లు వ‌చ్చేశాయి. ప్ర‌ధాన‌మంత్రుల్ని ఈ దేశం చాలామందినే చూసింది. కానీ.. మోడీ త‌ర‌హా ప్ర‌ధాన‌మంత్రి ఇదే మొద‌టిసారిగా చెప్పాలి.
ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఆయ‌న ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిర్వ‌హించిన ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు అవాక్కు అయ్యేలా చేయ‌ట‌మే కాదు.. షాకింగ్ గా మారాయి. దేశ ప్ర‌ధాని స్థానంలో కూర్చున్న కీల‌క నేత నోటి నుంచి ఈ త‌ర‌హా మాట‌లా? అన్న క్వ‌శ్చ‌న్ అవ‌స‌రం లేన‌ట్లుగా మోడీ మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.
తాజాగా ఆయ‌న చేసిన మాట‌లు విన్న త‌ర్వాత‌.. రానున్న రోజుల్లో మోడీ ఏం మాట్లాడినా.. పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేని రీతిలో తాజా మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.
దేశ ప్ర‌ధాని స్థానంలో కూర్చున్న వ్య‌క్తి ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌టమా? అని నోరెళ్ల బెట్టేలా మోడీ తాజా వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. రాజ‌కీయాల్లో స‌వాల‌చ్చ ఉండొచ్చు. అందుకని.. విలువ‌ల ర‌క్ష‌కుడిగా.. పెద్ద‌న్న‌లా ఉండాల్సిన స్థానంలో కూర్చొని చౌక‌బారు రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేసిన మోడీ మాట‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో పెను సంచ‌ల‌నంగా
మారాయి. ప‌వ‌ర్ మా చేతిలో ఉంది. మేం ఏమైనా చేస్తామ‌న్న‌ట్లుగా మోడీ మాట‌లు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
ప‌శ్చిమ‌బెంగాల్ లో పాగా వేసేందుకు విప‌రీతంగా శ్ర‌మిస్తున్న మోడీ.. తాజా ఎన్నిక‌ల్లో బెంగాలీల‌కు కొత్త అనుభ‌వాన్ని మిగిల్చేలా వ్యాఖ్య‌లు చేశార‌ని చెప్పాలి. ఇంత‌కీ ఆయ‌నేం మాట్లాడారన్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే.. విష‌యం అర్థ‌మైపోతుంది. కోల్ క‌తా స‌మీపంలోని సెరంపూర్ లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవేమంటే..

+ ‘‘తృణమూల్‌ ఎమ్మెల్యేలు 40 మంది నాతో టచ్‌లో ఉన్నారు. మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత మరింత మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ సీఎం పదవిని కాపాడుకోవడం కష్టమవుతుంది’’

+ ‘‘దీదీ.. మే 23న ఫలితాల రోజు దేశమంతటా కమలం వికసిస్తుంది. మీ ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు కూడా మీ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు నాతో మాట్లాడుతున్నారు’’

+ రాబోయే రోజుల్లో ఆమె ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కూడా కష్టమవుతుంది. ప్రజలను దారుణంగా మోసగించడమే దీనికి కారణం. గడిచిన మూడేళ్లలో బెంగాల్‌లో అనేక పోంజీ కేసులు వెలుగు చూశాయి.

+ ‘‘అనుమతుల నుంచి ప్రవేశాల దాకా.. ప్రతి విషయంలోనూ ప్రజలు డబ్బును చెల్లించాల్సిందే. మమత ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా ఉంది. ప్రభుత్వ పెద్దల సిద్ధాంతాలను అంగీకరించని వారిని ఉరి తీస్తారు’’

+ ‘‘దీదీ అణచివేత ధోరణి.. పాలనకు ఇదే నిదర్శనం. చొరబాటుదారులేమో సౌకర్యవంతంగా ఉంటున్నారు. దేశభక్తులు మాత్రం భయంభయంగా బతకాల్సి వస్తోంది. గూండాలు పూర్తి భద్రంగా ఉండగా.. మన చెల్లెళ్లు, కూతుళ్ల భద్రతకు మాత్రం గ్యారంటీ లేదు’’

+ ‘‘బెంగాల్‌ గడ్డపై అనేక మంది ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధులు తిరిగారు. నా వరకు ఇక్కడి మట్టి స్ఫూర్తిదాయకం.. శక్తిమంతం. బెంగాల్‌ మట్టితో చేసే రసగుల్లాల కోసం ఎదురుచూస్తున్నా’’