మోదీ వ‌ర్సెస్ ప్రియాంక‌...ఎవ‌రిది పై చేయి

July 08, 2020

కేంద్రంలో ఎలాగైన అధికారంలోకి రావాల‌ని జాతీయ పార్టీలు విశ్వ ప్రయ‌త్నాలు చేస్తున్నాయి. మోదీ మ్యాజిక్‌తో అధికారంలోకి వ‌చ్చిన ఎన్‌డిఎ ఎలాగైన మ‌రోసారి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌నే ధీమాతో ఉంది. ఉత్త‌రాన మోదీ హ‌వా ఇంకా కొన‌సాగుతుంద‌ని బీజేపీ న‌మ్మ‌కంతో ఉంది. ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక‌త కార‌ణంగా ప్ర‌జ‌లు కాంగ్రెస్ ప‌క్షాన నిలుస్తార‌ని భావిస్తోంది. రాహుల్‌ను ప్ర‌ధాన మంత్రి చేయడానికి ఇదే అవ‌కాశ‌మ‌ని కాంగ్రెస్ ఆలోచ‌న‌. అందుకే పార్టీ ప‌గ్గాల‌ను రాహుల్‌కు అప్ప‌గించారు. అయితే కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవ‌డ‌మే కాదు మోదీకి ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని ప్ర‌ణాళికా బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. అందుకే ప్రియాక వాద్రాను కూడా పార్టీ ప‌ద‌వి అప్ప‌గించారు. తాజా రాజకీయ పరిణామాల్ని పరిశీలిస్తే. కాంగ్రెస్ పార్టీలో ఫుల్ యాక్టివ్ అయిన ప్రియాంక వాద్రా ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి కూడా దిగుతారనే విషయం సంచలనం సృష్టిస్తోంది. ఈ సారి ప్రియాంక ఛరిష్మా తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందని కాంగ్రెస్ వాళ్లు పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

అందులో భాగంగానే ప్రధాని మోడీ పై ఎన్నికల్లో పోటీ కి సైతం సై అంటున్నారట ప్రియాంక. ఈ సారి కూడా మోడీ వారణాసి నుంచి పోటీ చేయడం ఖాయమైన నేపథ్యంలో, ఆయన మీద తానూ పోటీ చేయడానికి గౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. కార్యకర్తలతోనే ఆమె ఈ విషయాన్ని నేరుగా చెప్పడంతో ఇక ప్రియాంక మోడీ ల సమరం ఫిక్స్ అయినట్టే అంటున్నారు పరిశీలకులు.ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్స్ మాత్రం అవన్నీ పుకార్లేనని, తాము నమ్మమని ఒకవేళ ప్రియాంక గనుక పోటీ చేస్తే ఆ విషయం అధికారికంగా వస్తుంది తప్ప ఇలా ప్రకటనలు కాంగ్రెస్ పార్టీలో ఉండవని అది అందరికి తెలిసిన విషయమేనని అంటున్నారు. మరి మీడియాలో సైతం విశ్వవ్యాప్తం అయిన ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు తమకేమి తెలియదనేట్టుగా వ్యవహరించడంతో ప్రియాంక పోటీ పై మరిన్ని అనుమానాలని రేకెత్తిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. ఒక వేళ అదే జరిగితే పాపం రాహుల్ గాంధీ ఆటలో అరటిపండు అవుతాడేమో అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.