తనపై మోదీ ప్లానేంటో చెప్పిన చంద్రబాబు

June 03, 2020

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ముగించేసుకున్న చంద్ర‌బాబు... ఇప్పుడు పొరుగు రాష్ట్రాల్లో టీడీపీతో భావ‌సారూప్య‌త క‌లిగిన పార్టీల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆదివారం క‌ర్ణాట‌క‌లోని సింధ‌నూరు త‌దిత‌ర ప్రాంతాల్లో తెలుగు ప్ర‌జ‌ల‌తో భేటీ సంద‌ర్భంగా ఆయ‌న నోట నుంచి సంచ‌ల‌న వ్యాఖ్య ఒక‌టి వినిపించింది. ఈ ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోదీని ఓడించి తీరాల్సిందేన‌ని పిలుపు ఇచ్చిన చంద్ర‌బాబు... అలా కాకుండా మ‌ళ్లీ మోదీనే పీఎం పీఠం ఎక్కితే మాత్రం త‌న లాంటి ప్రజాస్వామ్యవాదులను నాశనం చేయడమే పనిగా పెట్టుకుంటాడని అన్నారు. ఈ క్ర‌మంలో మోదీ మ‌ళ్లీ గెలిస్తే... త‌న‌పై కేసులు పెడ‌తార‌ని, ఏకంగా త‌న‌ను జైలుకు పంపినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు.

ఇప్పటికే అన్ని వ్యవస్థలను పాడు చేసిన మోడీ తాను అనుకున్నది జరగడాని కోసం వ్యవస్థలను ఎంత పతనం చేయడానికి అయినా వెనుకాడరని అన్నారు. ఇప్ప‌టిదాకా తాను ఎలాంటి అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని, త‌న జీవిత‌మంతా తెరిచిన పుస్త‌క‌మేన‌ని వ్యాఖ్యానించిన  చంద్ర‌బాబు.. త‌న‌పై కేసులు పెడ‌తారేమోన‌ని చెప్పడం అంటే... మోదీ చట్టాలను ఎంత దుర్వినియోగం చేస్తారో అర్థం చేసుకోవాలన్నట్లు సూచించారు. మోదీ మ‌రోమారు ప్ర‌ధాని అయితే ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని చెప్పేందుకే బాబు ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అర్థమవుతోంది.