స్టార్ హీరోకి గ్యాలం వేసిన మోడీ! సీటు ఎక్కడంటే..?

August 03, 2020

సరిగ్గా ఐదేళ్ల క్రితం మోడీ ప్రధాని పీఠమెక్కినప్పుడు దేశ భవితవ్యం మారిపోతుందని, పేదరికం అనేది కనిపించదని ప్రజలంతా భావించారు. కానీ తీరా ఐదేళ్లు ముగిసే సరికి ఆ ప్రజలే మోడీ విశ్వరూపం చూసి గుండెలు బాదుకుంటున్నారు. చెప్పిందేమిటి? చేసేదేమిటి? అనేది అర్థం కాక గుర్రుగా ఉన్నారు. ఇక మోడీని నమ్మే పరిస్థితుల్లో లేరు దేశ ప్రజలు. అయితే దీనికి విరుగుడుగా మోడీ పెద్ద ప్లానే వేశారు. సెలబ్రిటీలను రంగంలోకి దింపడం ద్వారా ఓట్లు దండుకోవచ్చని వ్యూహ రచన చేశారు. ఆ కోణంలోనే మోడీ అడుగులు పడుతున్నాయి.

గత కొన్నాళ్లుగా కాస్త బీజేపీ అనుకూలవాదిగా కనిపిస్తున్నాడు అక్షయ్. కానీ ఆయన ఎక్కడా బహరంగంగా బీజేపీ విధానాలను సమర్థించలేదు. ఒక ఒపీనియన్ అయితే జనరేట్ అయ్యింది. దీంతో గాసిప్స్ కు ఆస్కారం ఏర్పడింది. అక్షయ్ కుమార్ బీజేపీ తరఫున బరిలోకి దిగితున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో ఈ పరిస్థితి గమనించిన అక్షయ్ వాటిని కొట్టిపారేశారు. తను బీజేపీ తరఫున పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. తను అమృత్ సర్ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలు తన అజెండా లేవు అని ఆయన కుంబద్ధలు కొట్టేశాడు. తాను ప్రత్యక్షరాజకీయాల్లోకి అసలు రావాలని అనుకోవడం లేదని, తనకు రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తి లేదని అక్షయ్ అన్నారు. తద్వారా తన మీద సాగుతున్న పొలిటికల్ రూమర్లను ఆయన చెక్ పెట్టేశారు.

దీంతో సెలబ్రిటీల ద్వారా ఓట్లు పట్టేయొచ్చు అని మోడీ వేసిన స్కెచ్ బెడిసికొట్టిందనే కోణంలో జనం చర్చించుకుంటున్నారు. నిజమే కదా మరి.. ఐదేళ్ల కాలంలో చేసిన పనులు, పాలనా విధానం, పథకాలు, చేసిన వాగ్దానాలు అవేవీ పట్టించుకోకుండా నువ్ సెలెబ్రిటీని పెడదామనుకుంటే.. వారికి మాత్రం నీ వ్యవహారం తెలియదా? అంత ఈజీ గా మీ పార్టీ నుంచి పోటీలోకి వచ్చేస్తారా? ఇలా జనంలో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.