2024లో మోడీ గెలవడు - జగన్ సంచలనం

August 13, 2020

అనేక సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న జగన్ మోడీ గురించి ఇలాంటి కామెంట్లు చేశారంటే మీరు నమ్మకపోవచ్చు. కానీ మోడీ పదం వాడకుండా జగన్ ఇదే విషయాన్ని మన పాలన - మీ సూచన కార్యక్రమంలో కుండబద్దలు కొట్టారు. మరి ఎన్నికలు ముందు పాలు పోసి పెంచిన తమ అభిమాన నేత జగన్ ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని మీరు ఊహించి ఉండరు. బీజేపీ నేతలు అస్సలు ఊహించి ఉండరు. ఇంతకీ ఈ మాట ఎలా అన్నాడు, ఏమన్నాడు అన్న ఆసక్తి ఉత్కంఠ మీలో పెరిగిపోతుంది కదా చెబుతాం.

జగన్ ఏమన్నారంటే...
 
’’ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం చెప్పింది. కానీ ఇవ్వలేదు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎంతో ఉపయోగం. అది వచ్చి ఉంటే ఏపీకి పన్ను మినహాయింపులు వచ్చేవి. దీనివల్ల ఎన్నో
పరిశ్రమలు ఏపీకి వచ్చేవి. అయినా పర్లేదు. ప్రత్యేక హోదా వస్తుంది. ఇపుడున్న ప్రభుత్వం కేంద్రంలో పూర్తి మెజారిటీతో ఉంది. రాబోయే ఎన్నికల్లో (భవిష్యత్తులో) కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం మన మీద ఆధారపడక తప్పదు. అపుడు మనం ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తాం‘‘
 
దీని భావమేమిటి ? అని ఆరో తరగతి పిల్లాడిని అడిగినా చెబుతాడు. వచ్చే ఎన్నికల్లో మోడీకి అంత సీన్ లేదు. ఇన్ని సీట్లు రావు. సొంత మెజారిటీ రాదు. కానీ అపుడు మనం మళ్లీ భారీ సీట్లతో గెలుస్తాం. మళ్లీ అధికారంలోకి వస్తాం. అపుడు మన ఎంపీ సీట్లు కావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే వారిని డిమాండ్ చేస్తాం అనే కదా జగన్ కామెంట్లకు అర్థం. 
ఇది కాకుండా వేరే అర్థం ఉందని వైసీపీ వాళ్లు, బీజేపీ వాళ్లు వాదించగలరా? 
వాదించే అవకాశం ఉంది. అది ఎలాగో తెలుసా? జగన్ 2024లో అనలేదు, భవిష్యత్తులో అన్నారు అని వాదించే అవకాశం ఉంది. అలా అంటే 2029 వరకు ప్రత్యేక హోదా రాదన్నమాట. పదేళ్లకు బతికేదెవరు? అడిగేదెవరు? గుర్తుపెట్టుకునేదెవరు? తప్పించకునే మాటలు మాట్లాడటంలో జగన్ కి తిరుగులేదు.
కొసమెరుపు - టీడీపీ గత 5 ఏళ్లలో ప్రత్యేక హోదా తేలేకపోయిందట. ఇపుడు మాత్రం సొంత మెజారిటీ ఉండటం వల్ల తేలేకపోతున్నాడట. అది తన తప్పు కాదట. మీకు దండం సామీ!