మళయాళీ ’’బాహుబలి‘‘ ట్రైలర్ వచ్చేసింది !

August 07, 2020

మళయాళీ నిర్మాతల నుంచి వంద కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న తొలి చిత్రం ’మరక్కార్’ ట్రైలర్ వచ్చేసింది. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో అర్జున్, కీర్తిసురేష్ కీలక పాత్రల్లో నటించారు. అరేబియా సముద్రపు సింహం అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూశాక సినిమా మీద అంచనాలు పెరిగాయి. బ్రిటిషర్లను, పాశ్చాత్యులను ఎదుర్కొన్న యోధుడి కథను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ప్రియదర్శన్ దర్శకత్వ ప్రతిభ కనిపిస్తోంది. ఈ నెల 26వ తేదీన మళయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ చూసి మీ ఫీడ్ బ్యాక్ ఏంటో చెప్పండి. సింపుల్ గా చెప్పాలంటే... మళయాళీ బాహుబలి అని చెప్పొచ్చు ఈ సినిమాను.