మోక్ష‌జ్ఞ ఎక్కడ కనిపించాడో తెలుసా?

July 04, 2020

గుడికి వెళ్ల‌టం త‌ప్పేం కాదు. అందులోకి ఫ్యామిలీతో క‌లిసి గుడికి వ‌స్తున్నార‌న్న విష‌యం అంద‌రికి తెలీయ‌కూడ‌ని ర‌హ‌స్య‌మేమీ కాదు. కానీ.. అందుకు భిన్నంగా ప్ర‌ముఖ న‌టుడు క‌మ్ హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాలోని ఒక గుడికి రావ‌టం హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. సంచ‌ల‌న‌మైంది.
కొంతకాలంగా మోక్ష‌జ్ఞ బొద్దుగా మారారు. క‌ళ్ల‌జోడుతో కనిపిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఇలా ఉండేవాడు కాదు. ఇలా మారిపోయినప్పటి నుంచి అతను కనిపించడం బాగా తగ్గించారు. మళ్లీ ఇన్నాళ్లకు అది కూడా పూజ కోసం బయటకు వచ్చారు.

సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లుగా మోక్ష‌జ్ఞ గురించి గ‌తంలో అప్పుడ‌ప్పుడు వార్త‌లు వ‌చ్చేవి. ఆయ‌న హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని.. త్వ‌ర‌లోనే ఆయ‌న్ను అంద‌రికి ప‌రిచ‌యం చేస్తార‌ని.. ఏజ్ మారుతున్న నేప‌థ్యంలో లుక్ ఫ్రెష్ గా ఉండేందుకు బ‌య‌ట‌కు రానివ్వ‌టం లేద‌న్న ప్ర‌చారం సాగేది.
ఇంత‌కీ కొడుకును తీసుకొని బాల‌య్య వ‌చ్చిన గుడి ఎక్క‌డ‌? దాని ప్ర‌త్యేక‌త ఏమిట‌న్న‌ది చూస్తే.. తూర్పు గోదావ‌రి జిల్లా అంబాజీపేట మండ‌లం పుల్లేటికుర్ర‌లోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం శ్రీ చౌడేశ్వ‌రి స‌మేత శ్రీ‌రామ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో పూజ‌లు నిర్వ‌హించారు.
ఆల‌యంలో చండీ హోమం.. సుద‌ర్శ‌న హోమంతో పాటు.. స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వ‌హించిన‌ట్లు చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ ఆల‌యంలో బాల‌కృష్ణ పూజ‌లు చేయించ‌టం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు నిర్వ‌హించారు. కాకుంటే.. ఈసారి కొడుకుతో వచ్చారు.