అబద్ధం చెబితే నమ్మేలా ఉండి మంత్రిగారూ 

June 04, 2020

ఏపీలోనే కాదు.... లాక్ డౌన్ నిబంధనలు పాటించని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు ? అని దేశంలో  టీవీ చూసే వారిని ఎవరిని అడిగినా... ఠక్కున వైసీపీ అని సమాధానం చెప్పే పరిస్థితి ఏపీలో ఉంది. అలాంటి పార్టీలో ఉన్న మోపిదేవి వెంకటరమణ... ఏపీలో కరోనా వ్యాప్తికి టీడీపీ కారణమని సంచలన ఆరోపణలు చేశారు. అదెలా అంటే... చంద్రబాబు ఏపీకి కరోనా స్లీపర్ సెల్స్ ని పంపారట. వారు ఇంటింటికీ వెళ్లి కరోనా అంటిస్తున్నారట. అందుకే కరోనా పెరుగుతోందట. సరే కాసేపు ఇదే నిజమనుకుందాం... జనం రోడ్ల మీద తిరుగుతుంటే పోలీసులు, సర్కారు ఏం పని చేస్తోంది. 

అంటే పోలీసులు ఏపీలో పనిచేయడం లేదా? ముఖ్యమంత్రి పనిచేయడం లేదా? జనం రోడ్ల మీద తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చేస్తుంటే దానిని నివారించడంలో కాకుండా ఇంక దేంట్లో బిజీగా ఉన్నారు? మంత్రి మాటలు వింటే ఎవరైనా ఇదే ప్రశ్న వేస్తారు. లాక్ డౌన్ అమల్లో ఉంది. .ఏపీలో రెండు గంటలు మాత్రమే అది కూడా నిత్యావసరాలకు మాత్రమే ప్రజలను బయటకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో నోటికి వచ్చినట్లు మాట్లాడితే జనం ఏమైనా అమాయకులా మోపిదేవి. 

మీ ముఖ్యమంత్రి స్వయంగా ఏం చెప్పాడో గుర్తుతెచ్చుకోండి. హాస్టల్ విద్యార్థులు హైదరాబాదు నుంచి వస్తుంటే.. 14 రోజులు క్వారంటైన్లో ఉంటే అనుమతిస్తాం అని చెప్పి, కేసులు ఎక్కువగా ఉన్న తమిళనాడు నుంచి తెచ్చిన ఎన్నికల కమిషనర్ కనగరాజు మాత్రం ఏ క్వారంటైన్ లేకుండా రాష్ట్రంలో ఎలా తిప్పారు? ఆయన ప్రమాణ స్వీకారం రోజు ఎలా ఆయన అంత ఆగమేఘాల మీద తెచ్చారు.? మరి ఆయనకు టెస్టులు చేశారా? చేయలేదా? అని వెల్లడించలేదు. మరి ఆయనేమో రాజ్ భవన్ కి వెళ్లారు. అందుకే టీడీపీ కనగరాజ్ వల్ల రాజ్ భవన్లో కరోనా వచ్చిందా? అని ప్రశ్నించింది. దానికి ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా? మరి కనగరాజ్ వల్ల రానపుడు ఎవరి ద్వారా వచ్చిందో మీకైనా తెలుసు కదా? ఆ విషయం వెల్లడించి టీడీపీ నోరు మూయించొచ్చు కదా. ఏపీ సర్కారు అంతా దాగుడుమూతలు ఆడుతూ స్లీపర్స్ కరోనా, ఆ కరోనా ఈ కరోనా అంటూ కాకమ్మ కబుర్లు చెబితే ఎలా? జగన్ సమర్థత ఏంటో ఇపుడు ఏపీ ప్రజలందరికీ తెలిసిపోయింది. మీ ఎన్నికల పిచ్చితో ఏపీని కరోనా మూడో దశకి తీసుకెళ్లారు. తప్పు మీవైపు పెట్టుకుని అందరి మీద నోరు పారేసుకుంటారా? 

శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం, విజయనగరంలో బొత్స, విశాఖ,  గోదావరిలో సాయిరెడ్డి, విజయవాడలో జగన్, గుంటూరులో రజని, ప్రకాశంలో కొండెపి నాయకులు, కడపలో శ్రీకాంత్ రెడ్డి, సూళ్లూరు పేటలో వైసీపీ నేత, చిత్తూరులో బియ్యపు రెడ్డి... అనంతపురంలో మాధవ్, కర్నూలులో హఫీజ్ ఖాన్... ఇలా ఒకరేమిటి ప్రతి నాయకుడు గుంపును వేసుకుని తిరుగుతూ కరోనా స్ప్రెడర్లుగా మారారు. 

ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో తిట్లు కూడా తిన్నారు. ఇపుడు ఇద్దరు నేతలకు కరోనా వచ్చింది. ఇంకా చంద్రబాబు కరోనా వ్యాప్తి చేపిస్తున్నారడం పరాకాష్ట కాదా?