తెలంగాణ గవర్నమెంటుకు జ్జానోదయం... రేపటి నుంచే ఆ పని

August 13, 2020

నిజం నిప్పు లాంటిది. అది దాగదు. దాచినా దాగదు. ఈ విషయాన్ని తెలంగాణ సర్కారు ముందే గ్రహించి ఉంటే హైదరాబాదు కాస్త బెటర్ పొజిషన్లో ఉండేది. కానీ ఇపుడు చేతులు దాటిపోయాక తెలంగాణ సర్కారు మేల్కొంది. ఏం అడిగినా ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం చేస్తామంటున్నారే గానీ... ఐసీఎంఆర్ ఎక్కువ టెస్టులు చేయొద్దు అని చెప్పలేదన్న నిజాన్ని మాత్రం వినడానికి ఇష్టపడలేదు.

కేసులు దాచిపెట్టడం ప్రజలకంటే ప్రభుత్వానికి ఎక్కువ నష్టం చేసింది. వెంటనే టెస్టులు చేసి కేసులను గుర్తించడం ద్వారా వ్యాప్తిని కంట్రోల్ చేసి ఉంటే హైదరాబాదులో ఇంత భారీగా కరోనా ఉండేది కాదు. ఇపుడు కేసులు పెరగడం వల్ల వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఉద్యోగులు హైదరాబాదు వదిలేసి పోయారు. దీంతో తెలంగాణలో వ్యాపారం దారుణంగా పడిపోయింది. దీంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.

తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల మాట్లాడుతూ ... హైదరాబాదులో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని ఒప్పుకున్నారు. మరి గతంలో అద్భుతంగా కంట్రోల్ చేస్తున్నాం అన్నారు. కంట్రోల్ చేస్తే ఇంత ఎందుకు పెరిగిందన్న ప్రశ్నకు ఈటెల వద్ద సమాధానం లేదు.

రేపటి నుంచి కోవిడ్ టెస్టులు భారీ ఎత్తున చేస్తాం అన్నారు. కరోనా పేషెంట్లకు సరైన చికిత్స అందడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కోప్పడ్డారు. చనిపోయిన పేషెంట్లు మరణానికి ముందు విడుదల చేసిన వీడియోలను కూడా ప్రభుత్వం నమ్మకపోతే ఇక ఎవరు చెబితే నమ్ముతారు? 

ఈటెల హైలైట్స్

258 వైద్య సిబ్బందికి కరోనా వచ్చింది

ఒక హెడ్ నర్స్ చనిపోయారు

బెడ్లు, వెంటిలేటర్ల కొరత లేదు

వారం రోజుల్లో 10 వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయి