ఆంధ్రోళ్లపై జగన్ దెబ్బ - టీటీడీ జాతీయం

May 31, 2020

మీరే రాష్ట్రానికైనా వెళ్లండి. ఆ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ఏ సంస్థలోనైనా చూడండి. ఆయా రాష్ట్రాలకు చెందిన వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇతర రాష్ట్రాల వారికి పదవులు ఇవ్వాల్సి వస్తే నామమాత్రంగా ఒక పదవి ఇచ్చి సరిపెడతారు. కాదూ.. కూడదంటే రెండుపదవులు ఇస్తారు. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రోళ్లు అవాక్కు అయ్యేలా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఏ ఒక్క ఆంధ్రోడికి పదవి ఇచ్చింది లేదు. ఆంధ్రా ప్రాంత మూలాలు ఉన్న వారు ఎవరైనా.. వారెంత సమర్థులైనా.. ఏళ్లకు ఏళ్లు తెలంగాణలో నివాసం ఉంటున్నా.. వారి విషయంలో అంతులేని వివక్షను ప్రదర్శిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా టీటీడీలో పాలకమండలి సభ్యుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం నోట మాట రాకుండా చేస్తోంది.
నిన్న కాక మొన్ననే ఆంధ్రా మూలాలు ఉన్న లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరగటమే కాదు.. ఆంధ్రోడు విమర్శిస్తారా? ఇక్కడి విషయాలు ఆయనకేం పని అన్నట్లుగా మాట్లాడిన కేసీఆర్ మాటలతో తెలంగాణలో ఆంధ్రా ప్రాంత మూలాలు ఉన్న వారికి తెలంగాణ అధికారపక్షం ఇచ్చే ప్రాధాన్యత.. గౌరవం ఏ పాటిదో ఇట్టే అర్థమైపోతుంది.  
తెలంగాణకు చెందిన వారికి పదవులు ఇవ్వొద్దన్న సంకుచిత్వం ఆంధ్రోళ్లకులేదు. కానీ.. ఆంధ్రోళ్ల కడుపు కొట్టినట్లుగా.. వారికి ఇవ్వాల్సిన పదవుల్ని వారికి ఇవ్వటం లేదు సరి కదా.. ఆంధ్రాకు.. తెలంగాణకు మధ్య వ్యత్యాసం ఒకే ఒక్క సభ్యుడే కావటం విస్మయానికి గురి చేస్తోంది. గత ప్రభుత్వంలో 18 మంది ఉన్న పాలకమండలిని ఏకంగా 28 మందిని చేశారు. అందులో 8 మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఉండగా.. వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురికి మండలిలో చోటు కల్పించటం షాకింగ్ గా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా వారికి ఇచ్చే ప్రాధాన్యతను చూసిన తర్వాత అయినా జగన్ లో మార్పు రావటం అటు ఉంచి.. ఏ లెక్కన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురిని పాలక మండలిలో ఎలా చోటు కల్పిస్తారన్న ప్రశ్నకు జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.మరో ఆసక్తికరమైన విషయం చూస్తే.. మొత్తం మండలిలోని 28 మంది సభ్యుల్లో.. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న నలుగురిని మినహాయిస్తే 24 మంది ఉంటారు. వారిలో 1/3వంతు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఉంటే.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారంతా కలిపి 2/3 వంతు  ఉండటం విశేషం. మరెక్కడా లేని రీతిలో వ్యవహరించిన జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వివిధ రాష్ట్రాలకు టీటీడీలో చోటు ఇవ్వొద్దని అస్సలుచెప్పటం లేదు. వారి సంఖ్య నామమాత్రంగా ఉండాలే తప్పించి.. ఆంధ్రోళ్ల కంటే రెట్టింపు సంఖ్యలో ఇతర రాష్ట్రాల వారు ఉండటాన్ని ఎలా చూడాలి? ఏ విధంగా అర్థం కావాలి. జగన్ కు ఓట్లు వేసింది ఆంధ్రోళ్లే తప్పించి తెలంగాణ.. తమిళులు.. కన్నడిగులు.. మరాఠీలు కాదన్న విషయాన్ని ఏపీ సీఎం ఎలా మర్చిపోయారన్నది ప్రశ్న. మండలికి సంబంధించి జగన్ ఫైనల్ చేసిన లిస్ట్ చూస్తే.. ఆంధ్రాలో ఆంధ్రోళ్లు మైనార్టీలుగా మార్చేసిన ఘనత జగన్ కే చెల్లుతుందని చెప్పక తప్పదు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫైనల్ చేసిన టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా :
ఆంధ్రప్రదేశ్
1.యువి రమణ మూర్తి (ఎమ్మెల్యే)
2.వి.ప్రశాంతి
3.మల్లికార్జున రెడ్డి (ఎమ్మెల్యే)
4.గొల్ల బాబూరావు (ఎమ్మెల్యే)
5.కె.పార్థసారథి (ఎమ్మెల్యే)
6.డిపి అనంత
7.చిప్పగిరి ప్రసాద్ కుమార్
8.నాదెండ్ల సుబ్బారావు
తెలంగాణ
1.జె.రామేశ్వరరావు
2.బి.పార్థసారథి రెడ్డి
3.యు.వెంకట భాస్కర రావు
4.మూరంశెట్టి రాములు
5.డి.దామోదర్ రావు
6.కె.శివ కుమార్
7.పుట్టా ప్రతాపరెడ్డి
తమిళనాడు
1.కుమారగురు (ఎమ్మెల్యే)
2.ఎస్.శ్రీనివాసన్
3.డాక్టర్ నిచితా ముత్తువరపు
4.కృష్ణమూర్తి వైద్యనాథన్
కర్ణాటక
1.రమేష్ శెట్టి
2.సంపత్ రవి నారాయణ
3.సుధా నారాయణ మూర్తి
ఢిల్లీ
1.ఎం ఎస్ శివ శంకరన్
మహారాష్ట్ర
1.రాజేష్ శర్మ
ఎక్స్ అఫీషియో సభ్యులు
1.చైర్మన్ (టీయూడీఏ)
2. స్పెషల్ సీఎస్
3.కమిషనర్ ఎండోమెంట్స్
4. టీటీడీ ఈవో

 

Read Also

పవన్‌లో ఒక నిజమైన నాయకుడు కనిపించిన వేళ..
43 వేల కోట్ల దొంగ... లక్ష ఫర్నీచర్ కోసం కేసుపెట్టి చంపాడు
కోడెల గొడవలో సైడైంది గానీ బీజేపీ జగన్ ను ఏకేసిందీరోజు