గుట్టు విప్పిన గూగుల్

August 13, 2020

లాక్ డౌన్ మనుషులకు ఎన్నో కొత్త విషయాలను బోధించింది. ప్రభుత్వం కిరాణా, సూపర్ మార్కెట్లను బంద్ చేయలేదు. దీంతో ఉప్పు పప్పు సమస్య లేకుండా పోయింది. ఇక ఒక్కొక్కరు ఒక్కో కొత్త సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ దేశానికి ట్యాక్సులు కట్టి నడిపే మందు బాబులు మాత్రం లాక్ డౌన్ తో తీవ్రంగా మదనపడుతున్నారు. 

21 రోజులు అని సర్దుకుందాం అనుకున్నారు. ట్రై చేశారు. కుదరలేదు. బ్లాక్ లో కొనడానికి ప్రయత్నించారు. పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో నువ్వే దిక్కు గూగులమ్మా అంటూ వేడుకున్నారు ఇండియాలో కరోనా జాగ్రత్తలు, కేసుల తర్వాత గూగుల్ ఎక్కువ మంది మందు కోసమే వెతికారు. అది ఎక్కడ దొరుకుతుందని కాదు.. ’ఇంట్లో మందు తయారుచేసుకోవడం ఎలా?‘ అని గూగుల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది మోస్ట్ సెర్చ్ డ్ ప్రశ్నలో నిలిచింది. 

అయినా వారికున్న క్రియేటివిటీ ఇంకెవరికి ఉంటుంది చెప్పండి? తాజాగా గూగుల్ ఈ మందుబాబుల గుట్టును బయటపెట్టింది. పాపం... ఎంత కష్టమొచ్చిందో వీళ్లకి.