చంటి బిడ్డతో రైలు పెట్టెల మధ్య ... దారుణం, కానీ

August 06, 2020

నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. చంటి బిడ్డతో ఒక మహిళ రెండు రైలు భోగీల మధ్య ఉన్న యాక్సిస్ లింకుపై కూర్చుని ఒక చేత్తో కడ్డీని, మరో చేత్తో చంటి బిడ్డను చేత్తో పట్టుకుని ప్రయాణం చేస్తోంది. ఇది ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటున్నారు. కానీ షేర్ చేసుకుంటున్న వారు ఎవరూ కూడా అది ఎప్పటి వీడియోనో చెక్ చేసుకోవడం లేదు. 

మోడీ వ్యతిరేకులు కొందరు మోడీ ఎలాంటి కష్టం తెచ్చాడు పేదలకు అని విమర్శించడానికి వాడుతున్నారు. వాస్తవానికి అది బంగ్లాదేశ్ కి చెందిన ఒక పాత వీడియో అని ’నమస్తే ఆంధ్ర.కాం‘ దీని గురించి వెతికినపుడు తెలిసింది.. బంగ్లాదేశ్ లో 2017లో జరిగిన ఈ ఘటనను బీహార్ లో జరిగిన సంఘటనగా కొందరు చిత్రీకరిస్తున్నారు. విచిత్రం ఏంటంటే... హైదరాబాదుకు చెందిన వెస్ట్ జోన్ డీసీపీ ఐపీఎస్ రమేష్ దీనిని షేర్ చేశారు. దీంతో అది మరింత వైరల్ అయ్యింది.

నిజానకు అది కొత్త వీడియో అని అని రమేష్ గారు చెప్పలేదు. అయినా కొందరు అతను పెట్టిన మ్యాటరు చదవకుండా వీడియోను చూసి ఆయనను విమర్శిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో పెడుతూ ఆయన ఏం చెప్పారో చూడండి...

ఎంత కష్టమొచ్చింది తల్లీ నీకు ! నా మనస్సు తల్లడిల్లింది నీ అవస్థ చూసి. ఎందుకు ఈ అభివృధ్ది ఎందుకు ఈ సంపద. నాకు దుఃఖం ఆగటంలేదు । అన్నీ ఉన్నా నీకేమి చేయలేకపోతున్నా । నన్ను క్షమించు తల్లీ ! మిత్రులారా, ఈ వీడియో చూడగానే చలించిపోయి పోస్ట్ చేయడం జరిగింది. ఇది కాలానికి, ప్రాంతానికి అతీతమైనది. ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయి అని తెలియని తరానికి తెలియజేసే ప్రయత్నం. టికెట్ లేకుండా పట్టుబడటం వల్ల కలిగే అవమానంకన్నా, ప్రాణం పోయినా పరవాలేదు అనుకున్న ఆ తల్లి కళ్లలో లో తెగింపు చూడండి 

 

 

 

ఎవరైనా ఇలాంటి వీడియోలు చూస్తే ముందు గూగుల్ చేసి పోస్టు చేయడం మంచిదని నమస్తే ఆంధ్ర అభిప్రాయం.