ఈ సమ్మర్ లో ఫుల్ ఫన్ !!

May 25, 2020
CTYPE html>
వాతావరణానికి కాలాలు మూడే. కానీ టాలీవుడ్ కు మాత్రం నాలుగు. అయితే... ఇవి సినిమా రిలీజ్ కాలాలు. ద‌స‌రా, క్రిస్మ‌స్, సంక్రాంతి సీజ‌న్ల మాదిరి... అంతకుమించిన సీజన్ సమ్మర్. సకుటుంబ సమేతంగా సెలవులు దొరుకుతాయి. పిల్లలకు సెలవు అయితే అమ్మలకు సెలవే కదా. ఇక నాన్న లీవు తీసుకున్నా, వీకెండ్ వచ్చినా...ఇక అన్ని సినిమాలను ఓ సూపు చూస్తారు. అందుకే మార్చితో మొదలయ్యే ఈ సీజన్ మిగతా సీజన్ల కంటే అతిపెద్దది. జూన్ లో స్కూల్ తెరిచే వరకు ఒకటే సినిమాల మోత. 
మరి సంక్రాంతి అయిపోయింది. త్వరలో రాబోయే సినిమాలు ఏంటో తెలుసుకుందాం. గతంతో పోలిస్తే ఈ సారి సంఖ్య పెద్దదే. భారీ చిత్రాలు తక్కువ, క్రేజీ చిత్రాలు ఎక్కువ.   
0 మార్చి 25న నాని-సుధీర్ బాబు కాంబినేష‌న్లో రాబోయే వి సినిమా తొలి వేస‌వి సినిమా.
0 ఏప్రిల్ 2న నాగ‌చైత‌న్య‌-సాయిప‌ల్ల‌వి-శేఖ‌ర్ క‌మ్ముల ల‌వ్ స్టోరీ వ‌స్తుంది. అదే రోజు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా డెబ్యూ సినిమా ఉప్పెన.
0 త‌ర్వాతి వారం రామ్ ’రెడ్‘ మూవీ రిలీజ‌వుతుంది. 
0 డేటు రాలేదు గానీ  ఏప్రిల్ లో కేజీఎఫ్ ఛాప్ట‌ర్-2 రిలీజవ్వొచ్చు.
0 ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య 17న రిలీజ‌వుతుంది. 
0 మేలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీ మూవీ.  నాగార్జున సినిమా వైల్డ్ డాగ్. అఖిల్ కొత్త సినిమా, గోపీచంద్ సీటీమార్, శ‌ర్వానంద్ శ్రీకారం, సాయిధ‌ర‌మ్ తేజ్ సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమాలు విడుదల అవుతాయి. వీటికి ఇంకా డేట్లు రాలేదు. కాకపోతే సమ్మర్ సినిమాలు అని ప్రకటించేశారు.