​ఎంపీలకు భారీ షాకిచ్చిన కేంద్రం

August 06, 2020

కరోనా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎంత తీవ్రంగా దెబ్బతీసిందో రోజురోజుకు మనకు అర్థమవుతోంది. ఆ మాటకు వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్తే అత్యంత దారుణ స్థితిలోకి జారిపోయింది. కరోనా నుంచి భయటపడటం ఒక యుద్ధాన్ని గెలవడం వంటిది అయితే... ఆర్థిక వ్యవస్థను తిరిగి చేతనావస్థలోకి తెచ్చి లోటును పూడ్చుకోవడం మరొక పెద్ద సర్కస్. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రపతి నుంచి గవర్నర్ల వరకు అందరి జీతాల్లో కోతపడింది. అయితే, దీనికి వారే స్వచ్చందంగా ముందుకు వచ్చారు. కేంద్ర కేబినెట్ మాత్రం ఎంపీల జీతాలు, అలవెన్సులు, పెన్షన్లను ఏడాది పాటు 30 శాతం కోత విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలు చేయడానికి 1954 ఎంపీ జీతాల చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. 

ఇక కేంద్రం తీసుకున్న మరో సంచలన నిర్ణయం ఏంటంటే... రాబోయే రెండు సంవత్సరాల పాటు ఎంపీ ల్యాడ్స్ ను రద్దు చేసింది. 2020 ఏప్రిల్ నుంచి రెండు ఆర్థిక సంవత్సరాల పాటు ఎంపీ ల్యాడ్స్ నిధులు రావు. సాధారణంగా ఈ ఎంపీ ల్యాడ్స్ ఎంపీలు తమ విచక్షణ మేరకు ఖర్చుపెట్టుకోవచ్చు. వీటి ద్వారా చేసే అభివృద్ధి పనులు ఆ ఎంపీల ఖాతాల్లోకి పోతుంటాయి. ప్రభుత్వ అభివృద్ధి పనుల కిందకు రావు. చాలామంది వీటిని తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటారు. వచ్చే రెండేళ్లు ఆ అవకాశం ఉండబోదు. ఎంపీ ల్యాడ్స్ రద్దు చేయడం ద్వారా కేంద్రానికి భారీ మొత్తం మిగలనుంది. అది ఎంతో తెలుసా? 7900 కోట్లు రూపాయలు. ఇది భారీ మొత్తం కిందే లెక్క.