ఈ పనిచేసే దమ్ము వైకాపాకి ఉందా?

February 25, 2020

ఇన్ సైడర్ ట్రేడింగ్ గొడవ తెలుగుదేశం, వైకాపాల మధ్య ఘోరంగా నడుస్తోంది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అయితే, అధికారం చేతిలో ఉన్న వైకాపా కేవలం ఇన్ సైడర్ ట్రేడింగ్ గురించి కేవలం ఆరోపణలకే పరిమితం కావడం అందరినీ ఆలోచనలో పడేస్తోంది. 

తెలుగుదేశం నేతలు స్వయంగా... మేము భూస్కుములు చేసి ఉంటే... చర్యలు తీసుకోండని చెబుతున్నా వైకాపా ప్రభుత్వం కిసుక్కుమనడం లేదు. ఎందుకు... తప్పులు ఉంటే గవర్నమెంటు ఎందుకు తీసుకోవడం లేదు అని జనంప్రశ్నిస్తున్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అని వైకాపా ఇచ్చిన ప్రజంటేషన్ ను బహిరంగంగా చర్చించడానికి వైకాపా సిద్ధమా? ఆ దమ్ముందా? అని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అవన్నీ అబద్ధాలు కాబట్టే చర్చలకు రావడానికి వైకాపా భయపడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది.

టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల వైకాపా సర్కారుకు ఛాలెంజ్ చేశారు.

రాజధాని ప్రకటనకు ముందు దొనకొండలో జరిగిన భూ లావాదేవీల వివరాలను బయటపెట్టే దమ్ము వైకాపాకి ఉందా? 

గత ఆరు నెలల్లో విశాఖ, భీమిలి ప్రాంతంలో జరిగిన భూలావాదేవీలను ప్రకటించే దమ్ము వైకాపాకి ఉందా?

వైకాపా నేతలకు ఎవరికైనా దమ్ము ఉంటే ఈ విషయాన్ని బయటపెట్టండి. బయటపెట్టకపోతే మీరు స్కాములు చేసినట్టే లెక్క. ప్రభుత్వం తాను అనుకున్నదాన్ని ధైర్యంగా చెప్పలేక కమిటీలు అంటూ చీకటి రాజకీయం చేస్తోందని కనకమేడల విమర్శించారు.