షాక్- ఓడించారు కదా... నా డబ్బులు నాకిచ్చేయండి

September 17, 2019

ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటు చేసుకోని సిత్ర‌మైన ఉదంతం ఒక‌టి చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన అభ్య‌ర్థి ఒక‌రు ఓడిడాడు. ఓడిన‌ట్లు తెలిసినంత‌నే తాను డ‌బ్బులు పంచిన ఓట‌ర్ల‌కు త‌న డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని అడిగి తీసుకున్న ఉదంతం చోటు చేసుకుంది. ఇదంతా మంచిర్యాల జిల్లా జిన్నారం మండ‌లం లింగ‌య్య ప‌ల్లెలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎంపీటీసీగా బ‌రిలోకి దిగిన మాదాడి హ‌న్మంత‌రావు ఓడిపోయాడు. దీంతో.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా తాను పంపిణీ చేసిన డ‌బ్బులు తిరిగి ఇచ్చేయాల‌ని కోరారు. దీంతో.. ఆ గ్రామ‌స్తులు తాము తీసుకున్న మొత్తాన్ని ఓడిన అభ్య‌ర్థికి తిరిగి ఇచ్చేశారు. ఈ సంద‌ర్భంగా తీసిన వీడియో ఒక‌టి వైర‌ల్ గా మారింది.  

ఇకపోతే గ‌త ఏడాది అక్టోబ‌రులో మొద‌లైన‌ ఎన్నిక‌ల సిరీస్ తాజాగా ముగిసిన స్థానిక ఎన్నిక‌ల‌తో దాదాపుగా పూర్తి అయిన‌ట్లుగా చెప్పాలి. దాదాపు తొమ్మిది నెల‌లుగా తెలంగాణ‌లో ఎన్నిక‌లు త‌ప్పించి మ‌రో మాట విన‌ప‌డ‌ని ప‌రిస్థితి. పాల‌న కూడా ప‌డ‌కేసింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో తెలంగాణ అధికార‌ప‌క్షం చారిత్ర‌క విజ‌యాన్ని సాధించ‌టం తెలిసిందే. రాష్ట్ర ప‌రిధిలోని అన్ని జడ్పీల‌ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. మ‌రే పార్టీకి అవ‌కాశం ఇవ్వ‌ని టీఆర్ఎస్‌.. మొత్తం 32 జిల్లాల్లోని జడ్పీల‌ను సొంతం చేసుకుంది. 32 జ‌డ్పీ ఛైర్మ‌న్లు.. వైస్ చైర్మ‌న్ల‌తో పాటు.. కో ఆప్ష‌న్ ప‌ద‌వుల‌న్నింటిని త‌న ఖాతాలో వేసేసుకుంది. ఈ విజ‌య దుందుబి జ‌డ్పీల‌కే ప‌రిమితం కాలేదు.. ఎంపీపీపీ ఎన్నిక‌ల్లోనూ సాగింది. 436 మండ‌ల పీఠాలు సొంతం చేసుకొని తెలంగాణ‌లో త‌న‌కు తిరుగులేద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. 

అయితే... సర్పంచి ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు ఎపుడైన అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం.