హైదరాబాదు : ఎమ్మార్వోని తగులబెట్టిన పౌరుడు

July 15, 2020

పనిచేయలేదని అసహనమో.. సైకో తనమో.. పాత పగలో కారణం... తెలియదు గాని పట్టపగలు అనేక మంది సిబ్బంది ఉండే ఆఫీసులోనే ఎమ్మార్వోను పెట్రోలు పోసి తగలబెట్టాడు ఓ వ్యక్తి. అతను ఎవరు అనేది తెలియదు. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసును చేధించడానికి కమిషనర్ తో పోలీసులు అందరూ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. 

అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఎమ్మార్వో విజయారెడ్డి ఆఫీసులో ఉండగా... ఒక దుండగుడు సంచిలో పెట్రోలు తెచ్చి ఆమె పై పోసి తగలబెట్టాడు. లంచ్ టైంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఆమె కొన్ని క్షణాల్లోనే మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మరణించారు. ఆమెను కాపాడబోయిన డ్రైవరు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో నిందితుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించి మంటలతోనే పారిపోయాడు. అబ్ధుల్లాపూర్ మండలానికి విజయారెడ్డి తొలి ఎమ్మార్వో. 

నిందితుడు ఎవరు? ఆమెపై ఎందుకు ఈ దాడిచేశాడు... అనేదానిపై పోలీసులు పరిశోధన చేస్తున్నారు. ఎమ్మార్వో ఆఫీసు మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.