జగన్ కి భయపడి ముద్రగడ ఏంచేశారంటే..

December 07, 2019

ఏపీకి ప్రత్యేక హోదా, కాపులకు రిజర్వేషన్లు... ఈ రెండూ ఏపీ రాజకీయాల్లో చాలా క్లిష్టమైన అంశాలుగా మారాయి. వీటి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. నిజానికి ఈ రెండూ కూాడా కేంద్ర పరిధిలోని అంశాలు. కానీ ఒత్తిడి మాత్రం స్థానిక పార్టీల మీదనే ఉంటోంది. కొన్ని జిల్లాల్లో తలరాతలు మార్చే సంఖ్యలో కాపు జనాభా ఉండటమే దీనికి కారణం కావచ్చు. ఈ శూన్యాన్ని అర్థం చేసుకున్న ముద్రగడ కాపులకు అప్రకటిత నాయకుడిగా ఎదిగేప్రయత్నం చేస్తున్నారు. ఆయనను ఎవరూ అడగకపోయినా కాపుల బాధ్యత తనది అని ఆయనంతట ఆయనే పబ్లిసైజ్ చేసుకుంటున్నారు. అయితే, ముద్రగడ వ్యవహార శైలి మాత్రం అనుమానస్పదంగా ఉంది.
కాపు రిజర్వేషన్ బిల్లు గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ఆమోదం పొందింది. బిల్లును ఆమోదించాక దానిని కేంద్రానికి పంపారు. ఇపుడు ఆ బిల్లు కేంద్ర హోం శాఖ వద్ద పెండింగ్ లో ఉంది. సుమారు ఏడాది గడిచినా ఇంతవరకు దానిని కేంద్రం పట్టించుకోలేదు. తాజాగా ముద్రగడ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి దీని గురించి లేఖ రాశారు.

2017 డిసెంబర్ 2వ తేదీన కాపు రిజర్వేషన్ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపిందని.. ఆ బిల్లును వెంటనే ఆమోదించి కాపులకు న్యాయం చేయాలని మోదీని ముద్రగడ లేఖలో కోరారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ బిల్లు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్ లో ఉందని చెప్పారు. తక్షణమే బిల్లును ఆమోదించాలని కోరారు.
ఇక్కడ ఒక విషయం అనుమానాస్పదంగా ఉంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు రిజర్వేషన్లు కల్పించాలని గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చని ముద్రగడ... జగన్ అధికారంలోకి వచ్చాక జగన్ కు లేఖ రాసినా... పెద్దగా బహిరంగ ప్రకటన, ఒత్తిడి తేలేదు. ఇపుడు తొలిసారి మోడీని అడగడంలో ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదు. 2017 డిసెంబరులో బిల్లు ఆమోదం పొందాక... పలుమార్లు చంద్రబాబుకు లేఖ రాశారు గానీ మోడీకి రాయలేదు. సుమారు ఏడాదిన్నర పాటు కేంద్రాన్ని ఎందుకు బిల్లు గురించి ముద్రగడ ఎందుకు అడగలేదు అన్నది ప్రశ్న. బాబు అధికారంలో ఉన్నంతకాలం బిల్లు ఆమోదించిన క్రెడిట్ చంద్రబాబుకు ఇవ్వలేదు ముద్రగడ. కానీ ఇపుడు ’చంద్రబాాబు పంపిన బిల్లు‘ ఆమోదించమని మోడీ అగడడం వెనుక ఆంతర్యం ఏంటో? జగన్ గురించి అర్థమైందా? లేదా జగన్ అంటే భయమా?

Read Also

జగన్ ఇలాగే తలూపితే... 2024 ఏపీ సీఎం కేసీఆరే
పవన్ పరువు తీసేసిన ఏకైక ఎమ్మెల్యే
యుద్ధ విమానాలు మోహరిస్తున్న పాకిస్తాన్