సీబీఐ వలలో మరో రెడ్డి !... చానా పెద్ద కథే !

August 05, 2020

అపుడు సరిగా తెలుగు వారిని నార్త్ వాళ్లు అంచనావేయలేదు గాని మనోళ్లు సామాన్యులు కాదు. మన తెలుగు వారు స్థాపించిన అనేక కంపెనీలు ప్రపంచంలో అనేక ప్రాజెక్టులు విజయవంతంగా చేపడుతున్నాయి.

తెలుగు వారికి చెందిన పలు కంపెనీల వాల్యుయేషన్ ఒక్కోటీ వేల కొట్లుంది.

అలాంటి వాటిలో జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒకటి. అయితే, తాజాగా ఈ గ్రూప్ చిక్కుల్లో పడింది.

తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగ ప్రముఖులుగా చెప్పే జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ జీవీకే రెడ్డి ఆయన కుమారుడు సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేయటం కొత్త కలకలం. 

వీరు రూ.300 కోట్ల ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి.  

జీవీకే రెడ్డి కుటుంబం మీద ఈ తరహా కేసు నమోదు కావటం రాజకీయ సినీ వర్గాల్లో కలకలం రేపింది. 

కేసు వెనుక కథేంటి?

ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (MEAL)  ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI), జీవీకే గ్రూప్ ప్రమోటర్‌గా ఉన్న జీవీకే ఎయిర్‌పోర్ట హోల్డింగ్స్ లిమిటెడ్, మరికొన్ని విదేశీ సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్.

ఇది ముంబై ఎయిర్ పోర్టును నిర్మించి, నిర్వహిస్తోంది. జీవీకే కంపెనీది మేజర్ వాటా (50.5 శాతం). ఇక్కడ ఆదాయంలో 38.7 శాతం మొత్తాన్ని ఎంఏఈఎల్ ఏఏఐకి చెల్లించాల్సి యాన్యువల్ ఫీ కింద చెల్లించాలి. 

మిగతా మొత్తాన్ని విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, నవీకరణకు వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది.

బోగస్ వర్క్ కాంట్రాక్టుల ద్వారా నిర్వహణ, అభివృద్ధి, నవీకరణకు వినియోగించాల్సిన నిధుల్లో కొంత మొత్తాన్ని జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ దోచేసిందని సీబీఐ కనిపెట్టింది.

దీనికోసం 9 ప్రయివేటు సంస్థలను వాడుకుందని ఎఫ్ఐఆర్‌లో ఉంది.

ఇలా రూ. 310 కోట్ల నిధులను దారి మళ్లించి 2017-18 మధ్య ముంబయి విమానాశ్రయ పరిసరాల్లో 200 ఎకరాలను రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ చేసిందట జీవీకే కంపెనీ. 

అంతే గాకుండా ఎంఐఏఎల్ వద్ద ఉన్న మిగులు నిధుల్లో రూ. 395 కోట్లను తమ ఇత (gvk group) కంపెనీలకు పరోక్షంగా వాడుకుందని సీబీఐ అనుమానించింది.

వాటిని హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసి జీవీకే గ్రూపు రుణాలు, ఓవర్ డ్రాఫ్టు ద్వారా నిధులు పొంది తమ గ్రూపు సంస్థలకు మళ్లించిందన్నది సీబీఐ కనిపెట్టింది.

ఇలా మొత్తం అనేక రకాలుగా  రూ. 705 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సీబీఐ పేర్కొంటోంది. అయితే... వీటిని సాక్ష్యాలతో ఇంకా సీబీఐ నిరూపించాల్సి ఉంది.

ఇకపోతే  ఈ జీవీకే ఎవరో కాదు... ఢిల్లీలో ఇండియా ప్రముఖులందరినీ పిలిచి కాస్ట్లీ పార్టీలు ఇచ్చే ప్రముఖ సినీ నిర్మాత కమ్ పారిశ్రామికవేత్త సుబ్బిరామిరెడ్డికి వియ్యంకుడు. 

సుబ్బిరామిరెడ్డి కుమార్తెను జీవీకే కుమారుడు సంజయ్ రెడ్డి మనువాడారు. సుబ్బరామిరెడ్డి ఎంపీగా కూడా చేశారు. మొన్న నిమ్మగడ్డ వీడియోలు లీక్ చేసిన పార్క్ హయత్ హోటల్ ఈ రెడ్డిదే.